Friday, May 10, 2024
- Advertisement -

లోకేష్‌ని నిలబెట్టడం కోసం ఆలయాలను కూడా భ్రష్టుపట్టిస్తున్నారా?

- Advertisement -

లోకేష్‌ని నాయకుడిగా నిలబెట్డడం కోసం చంద్రబాబు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. లోకేష్‌కి పోటీగా వస్తాడన్న ఉద్ధేశ్యంతో 2009ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రచారంలోకి దిగి తన ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్న ఎన్టీఆర్‌ని మానసికంగా హింసించారు. ఆయన సినిమా కెరీర్‌ని కూడా దెబ్బకొట్టాలని చూశారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ కూడా లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారిపోయిన వైనం గురించి రాజకీయ విశ్లేషకులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఏ హోదాలో లేకపోయినా 2014లో బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే లోకేష్ మంత్రులను కలవడం, అధికారిక సమావేశాలు నిర్వహించడం లాంటివి చేశాడు. మంత్రుల పేషీలన్నింటిలోనూ ఉద్యోగులందరి నియామకం లోకేష్ కనుసన్నల్లో జరిగిందన్న విషయం తెలిసి యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారన్న వార్తలు వచ్చాయి. ఇక ఎమ్మెల్సీగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచీ లోకేష్ హవా మామూలుగా లేదు.

మరోవైపు తనను ఎంతగా అవమానిస్తున్నా మోడీతో బాబు సర్దుకుపోవడానికి కూడా లోకేష్‌పై ప్రేమే కారణమని చెప్తున్నారు. కెసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతూనే కాంగ్రెస్ పార్టీతో కూడా రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు. మొత్తంగా ఒక్క వైఎస్ జగన్‌తో తప్ప అన్ని పార్టీల నాయకులతోనూ కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాడు చంద్రబాబు. ఆంద్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా బాబుకు చేసిన సాయం అంతా ఇంతా కాదు. బాబుకు మద్ధతివ్వడానికి రఘువీరారెడ్డి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇతర పార్టీల నాయకులు, తెలంగాణాలో ఉన్న పార్టీల నాయకులు, కాంగ్రెస్, మోడీతో కూడా సన్నిహిత సంబంధాలు నెరుపుతూ జగన్‌ని ఏకాకిని చేసి లోకేష్‌ని ముఖ్యమంత్రిగా చేయాలన్నది చంద్రబాబు కల. అందుకే ఆంద్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో మోడీతో, కెసీఆర్‌తో పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయాడు చంద్రబాబు. ఓటుకు నోటు కేసు మహత్యం కూడా ఉన్నప్పటికీ లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్‌కి తెరలేపాడు చంద్రబాబు.

ఇక ఇప్పుడు తాజాగా దుర్గమ్మ గర్భ గుడిలో ఒక ముఖ్య నాయకుడి కోసం తంత్ర పూజలు చేశారన్న వార్త విస్తుగొలుపుతోంది. లోకేష్ కోసమే ఆ క్షుద్ర పూజలు చేశారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మరోసారి లోకేష్ కోసం బాబు పడుతున్న తాపత్రయం చర్చనీయాంశం అయింది. రాహుల్‌ని ప్రధానిని చేయాలన్న ఆత్రంలోనే సోనియా ఎన్నో అనాలోచిత నిర్ణయాలు తీసుకుని చివరకు దేశానికే నష్టం చేసింది. ఇప్పుడు బాబు కూడా లోకేష్‌పై ప్రేమతో ఆంద్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాడని రాజకీయ మేధావులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -