Friday, April 26, 2024
- Advertisement -

మష్రూమ్ ఆమ్లెట్ ఇలా చేస్తే అస్సలు వదిలిపెట్టరు?

- Advertisement -

సాధారణంగా ఎగ్ ఆమ్లెట్ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఎంతో రుచికరమైన ఎగ్ ఆమ్లెట్ లోకి మష్రూమ్స్ జోడిస్తే తినడానికి మరింత రుచిగా ఉంటుంది. మరి రుచికరమైన ఆరోగ్యకరమైన మష్రూమ్ ఆమ్లెట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:
మీడియం సైజు పుట్టగొడుగులు 4, కోడిగుడ్లు 2, ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము టేబుల్ స్పూన్, చిటికెడు ఉప్పు, అర స్పూన్ కారం, మిరియాల పొడి అర టీ స్పూన్, నూనె తగినంత.

తయారీ విధానం:

*ముందుగా పుట్టగొడుగులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించికొని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన పుట్టగొడుగులను స్టౌ పై కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

Also read:ఆచార్య హీరోయిన్ కాజల్ అంత సంపాదించిందా.. వామ్మో?

*ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గుడ్లను పగలగొట్టుకోవాలి. ఈ గుడ్ల మిశ్రమాన్ని బాగా కలిపి అందులోకి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి బాగా కలియబెట్టాలి.

*ఈ విధంగా తయారు చేసుకున్న గుడ్ల మిశ్రమంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న పుట్టగొడుగులను కలపాలి.

Also read:సరికొత్త పాత్రలో సాయి పల్లవి స్పెషల్ వీడియో..?

*ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కాస్త నూనె రాసి పెనం వేడి ఎక్కిన తరువాత తయారుచేసి పెట్టుకున్న పుట్టగొడుగుల మిశ్రమాన్ని పెనంపై వేసి చిన్న మంటపై అటు ఇటు బాగా కాల్చుకోవడంతో ఎంతో రుచికరమైన మష్రూమ్ ఆమ్లెట్ తయారయినట్టే.

*ఈ విధంగా తయారు చేసుకున్న పుట్టగొడుగుల ఆమ్లెట్ తినడం వల్ల ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -