Saturday, May 11, 2024
- Advertisement -

మానవత్వ విలువలే లేవా? చంద్రబాబుది కూడా రాధాకృష్ణ స్థాయేనా?

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు అందరిలోకి ప్రజలకు నీతులు బోధించే నాయకుల్లో చంద్రబాబు చాలా ముందు ఉంటారు. పిల్లల పెంపకం నుంచీ ఎన్నో విషయాల్లో నీతులు బోధిస్తూ ఉంటారు. రాజకీయంగా, పరిపాలనా పరంగానే కాకుండా వ్యక్తిగత విలువలు నేర్పించడంలో కూడా నేనే మీకు దిక్కు అనేలా సాగుతుంది చంద్రబాబు మాటల వ్యవహారం. ఆ తర్వాత ‘నేను నిప్పు’ అని తనకు తానే సర్టిఫికెెట్ ఇచ్చుకోవడంలో కూడా చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు, ఓటుకు కోట్లులాంటి పబ్లిక్‌గా ససాక్ష్యాలతో కళ్ళ ముందున్న విషయాలు వదిలేద్దాం. 2014లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో మాయ మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చి జనాలను మోసం చేసిన విధానం కూడా అందరికీ తెలిసిందే. ఈ రోజుకీ కూడా ప్రత్యేక హోదా, ప్యాకేజ్, రాజధాని నిర్మాణం, రైల్వేజోన్‌లాంటి విషయాల్లో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నాడో అందరికీ అర్థమవుతూనే ఉంది. అవన్నీ వదిలేద్దాం… కనీసం మానవత్వ విలువలు కూడా లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం మాత్రం జుగుప్స కలిగిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబు గురించి జగన్ తప్పుగా మాట్లాడాడు. ఆ సందర్భంలో జగన్‌ని అందరూ తప్పు పట్టారు. ఆ సందర్భంలో జగన్‌ని తప్పు పట్టడం అవసరం కూడా. ఇప్పుడు చంద్రబాబు అంతకంటే పెద్ద తప్పే చేశాడు. ఇప్పుడు కూడా ఆ స్థాయిలో స్పందిస్తారా?

పొలంలో ఉన్న ఒక పంపుసెట్టు దగ్గర ఒక వ్యక్తి దోసిలితో నీళ్ళు తాగుతున్న ఫొటోని వైఎస్ భారతి పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్‌తో ఎవరో పోస్ట్ చేశారు. ఆ నీళ్ళు తాగుతున్న వ్యక్తి జగన్ అని ఆ ఫేక్ అకౌంట్ వ్యక్తి చెప్పారు. అది ఫేక్ అకౌంట్ అని, నాకసలు ఫేస్ బుక్, ట్విట్టర్….ఇంకా ఏ ఇతర సోషల్ మీడియా సైట్స్‌లోనూ అకౌంటే లేదని వైఎస్ భారతి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి విషయంలోనూ రాజకీయమే చూసే రాధాకృష్ణకు, ప్రతి విషయంలోనూ జగన్‌పై ఎలా విషం కక్కాలా అని ఆలోచించే రాధాకృష్ణకు వైఎస్ భారతి వివరణ అస్సలు అవసరం లేకపోయింది. ఆ నీళ్ళు తాగుతున్న వ్యక్తి జగనే అని ఒకసారి రాసి…….ఆ వెంటనే ఆ వ్యక్తి జగన్ కాదు…జగన్ భార్య వైఎస్ భారతి కూడా భర్తను గుర్తించలేకపోయింది అని మరోసారి రాస్తూ ……తన రాక్షసానందాన్ని బయటపెట్టుకున్నారు.

రాధాకృష్ణ విలువల గురించి అందరికీ తెలిసిన విషయమే అనుకుందాం. కానీ చంద్రబాబు నాయుడు కూడా రాధాకృష్ణ రాతలను ఆధారంగా చేసుకుని జగన్‌ని అందరూ మర్చిపోయారు. జగన్ ఇంటి మనుషులు కూడా జగన్‌ని గుర్తుపట్టడం లేదు అని పరోక్షంగా వైఎస్ భారతిని ప్రస్తావిస్తూ మాట్లాడడం మాత్రం….. అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడడం మాత్రం జుగుప్స కలిగిస్తోంది. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చెయ్యొచ్చు. జగన్ అవినీతి గురించి గంటలు గంటలు మాట్లాడొచ్చు. కానీ ఇలాంటి మాటలను మాత్రం మానవత్వ విలువలున్న ఏ ఒక్కరూ క్షమించరన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పటికి అర్థం చేసుకుంటారో? మాట్లాడితే జగన్ నాకు గౌరవం ఇవ్వడం లేదు అని విరుచుకుపడే చంద్రబాబు….. గౌరవం అనేది వయసుని బట్టి రాదు..వ్యక్తిత్వం, మనం ఆచరించే విలువలను బట్టి వస్తుంది అని తెలుసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -