Sunday, May 12, 2024
- Advertisement -

కాంగ్రెస్, బీజేపీలు అలా చేతులు కలిపేశాయి!

- Advertisement -

కాంగ్రెస్ విధనాలపై వ్యతిరేక స్వరంగానే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ వ్యతిరేకతనే ఊపిరిగా తీసుకొని ఎదిగింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది.

కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో అయితే.. కాంగ్రెస్ ను దేశ వ్యాప్తంగా చిత్తు చేసి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ , బీజేపీలు ఒకదానిపై మరోటి దుమ్మెత్తిపోసుకొంటన్నాయి. మోడీ పై కాంగ్రెస్ వాళ్లు విమర్శలు చేస్తున్నారు.

రాహుల్ పై బీజేపీ నేతలు దండెత్తుతున్నారు. ఒక విధంగా కాదు అనేక విధాలుగా కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీల మధ్య రచ్చలు కొనసాగుతున్నాయి. మరి పైకి అయితే ఇలా కనిపిస్తోంది కానీ… అవసరం వచ్చినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ లు ఒకదానితో మరోటి సహకరించుకొంటాయని స్పష్టం అవుతోంది. తాజాగా మహారాష్ట్రలోని ఒక జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి చైర్మన్ పదవులను పంచుకొన్నాయి.

ఆ  ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, నేషనలిస్టు కాంగ్రెస్ , శివసేన పార్టీలు పోటీ చేశాయి. ఈ పోటీలో సీట్లలో కాంగ్రెస్ ,బీజేపీలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అయితే ఎవరూ సొంతంగా చైర్మన్ కమిటీని ఏర్పాటు చేయలేకపోయాయి. ఎన్సీపీ, శివసేనలకు కూడా ఆ అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో… కాంగ్రెస్, బీజేపీలు జడ్పీ కమిటీని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ చైర్మన్ పదవిని.. బీజపీ డిప్యూటీ చైర్మన్ పదవిని సొంతం చేసుకొన్నాయి. మరి ఆగర్భశత్రువుల్లాంటి ఈ పార్టీలు కలిసిపోవడానికి మించిన ఆశ్చర్యం ఏముంది!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -