గూగుల్ క్రోమ్ వాడుతున్నారా .. జాగ్రత్త !

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచ సమాచారాన్ని క్షణాల్లో తెసులుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైనా సమాచారాన్ని వెతికెందుకు ఎక్కువగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే బ్రౌజింగ్ చేసేటప్పుడు పాప్ అప్ విండోస్ ద్వారా మనకు అన్నౌన్ వెబ్ సైట్స్ లోకి వెళుతూ ఉంటాం. అలా ఆ వెబ్ సైట్స్ ద్వారా మన మొబైల్ లోకి మాల్వేర్స్ అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

కేవలం మొబైల్స్ ద్వారా మాత్రమే కాకుండా కంప్యూటర్స్, లాప్ టాప్స్ , మాక్ బుక్స్ వంటి వాటిలో కూడా అన్నౌన్ వెబ్ సైట్స్ ద్వారా మాల్వేర్స్ ప్రభావం గట్టిగానే ఉంది. ఆ మాల్వేర్స్ లేదా వైరస్ ద్వారా ఎంతో మంది డేటా హ్యాకింగ్ కు గురి అవుతుంది. దాంతో ఈ మాల్వేర్స్ అటాక్ ను అడ్డుకునేందుకు గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు ప్రైవసీ పరంగా సరికొత్త చర్యలు తీసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ బ్రౌసర్ లో ఒక రహస్య బగ్ ను గుర్తించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గూగుల్ దీన్ని ” జీరో డే బగ్ ” గా పిలుస్తోంది. ఇది హ్యాకర్ల ద్వారా వెలుగులోకి వచ్చిందని గూగుల్ చెప్పుకొచ్చింది.

- Advertisement -

కాబట్టి ఈ బగ్ ను నిర్మూలించేందుకు అత్యవసరంగా క్రోమ్ బ్రౌజర్ లో అప్ డేట్ తీసుకువచ్చింట్లు పేర్కొంది. కాబట్టి గూగుల్ క్రోమ్ యూజర్లందరు తప్పని సరిగా అప్ డేట్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఎవరైనా అప్ డేట్ చేసుకోకపోతే వారి డేటా ప్రమాదం లో ఉన్నట్లేనని గూగుల్ గట్టిగా చెప్పుకొచ్చింది. అయితే ఇదే ఏడాది ఫిబ్రవరి, మార్చ్ లో కూడా క్రోమ్ బ్రౌజార్ లో బగ్ ను గుర్తించింది గూగుల్ సంస్థ. మళ్ళీ ఇప్పుడు జూలై లో మరొక బగ్ వెలుగులోకి రావడంతో గూగుల్ ప్రైవసీ పరంగా మరింత భద్రత చేపట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుతుంది.

Also Read: మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచే అద్బుతమైన టిప్స్ !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -