Friday, March 29, 2024
- Advertisement -

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచే అద్బుతమైన టిప్స్ !

- Advertisement -

నేటి రోజుల్లో మొబైల్స్ అనేవి మనకు తెలియకుండానే మన రోజు వారి జీవితంలో భాగంగా మారాయి. మొబైల్స్ లోని ఇంటర్ నెట్ ద్వారా ప్రపంచ నలుమూలల జరిగే సమాచారాన్ని చిటికెలో తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కోసారి మొబైల్ లోని క్యాచి కారణంగా మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. అలాంటి సమయంలో ఇంటర్నెట్ స్పీడ్ కోసం ఎన్నో రకాల యాప్స్ ను వాడుతూ ఉంటాం. అయినప్పటికి ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ మొబైల్ లోని సెట్టింగ్స్ ద్వారా ఇంటర్ నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు. మరి ఇంటర్ నెట్ స్లో అయినప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకుందాం..!

1.క్యాచి ని డిలెట్ చెయ్యడం
మొబైల్ లోని బ్రౌజర్ ఉపయోగించి గాని, లేదా ఏదైనా యాప్ ఉపయోగించి గాని, మనకు కావలసినవి డౌన్ లోడ్ చేసుకుంటూ ఉంటాం. ఆ తరువాత మళ్ళీ డిలీట్ చేస్తూ ఉంటాం. అయితే డిలీట్ అయిన తరువాత వాటికి సంబంధించి క్యాచి ఫైల్స్ అలాగే ఉంటాయి. దాంతో మన మొబైల్ స్లో గా రన్ అవ్వడంతో పాటు ఇంటర్నెట్ కూడా చాలా స్లోగా రన్ అవుతుంది. అలాంటి సమయంలో మొబైల్ లోని ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేసి మనం ఆన్ ఇన్ స్టాల్ చేసిన యాప్స్ యొక్క ఫైల్స్ ను పూర్తిగా డిలీట్ చెయ్యాలి. అప్పుడు మొబైల్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంది.

2.పోన్ రీ-స్టార్ట్ చెయ్యడం
ముఖ్యంగా మొబైల్ లో మనం యూస్ చేసే సర్వర్స్ కారణంగా అప్పుడప్పుడు మొబైల్ ఇంటర్నెట్ పై ప్రేజర్ పడుతుంది. అప్పుడు పోన్ హ్యాంగ్ అవ్వడంతో పాటు, ఇంటర్నెట్ కూడా స్లోగా రన్ అవుతుంది అలాంటప్పుడు పోన్ రీస్టార్ట్ చెయ్యడం ఉత్తమైన మార్గం. ఎందుకంటే పోన్ రీస్టార్ట్ చేసిన తరువాత మొబైల్ నెట్వర్ట్ పునఃప్రారంభిస్తుంది. దాంతో మొబైల్ యొక్క ఇంటర్నెట్ వేగం పెరుగుతుంది.

3.ఆటో అప్డేట్ నిలిపియేయ్యడం
సాధారణంగా యాప్స్ ను అప్డేట్ చెయ్యడానికి ఫోన్లో ఆటో అప్డేట్ ఆప్షన్ ఆన్ చేయబడిఉంటుంది. ఈ ఎంపికను ఆఫ్ చెయ్యడం వల్ల డేటా వినియోగం తగ్గడంతో పాటు, రామ్ పైన ఒత్తిడి తగ్గి ఇంటర్ నెట్ ఫాస్ట్ గా రన్ అయ్యేందుకు ఆస్కారం ఉంది.

4.నెట్వర్క్ సెట్టింగ్స్ రీస్టార్ట్ చెయ్యడం
మొబైల్ ను చిన్న పిల్లలకు చిన్నపిల్లలకు ఇచ్చినప్పుడు.. వాళ్ళు మొబైల్ లోని ఏవేవో సెట్టింగ్స్ ను ఆఫ్ చేయడం లేదా ఆన్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మొబైల్ ఇంటర్ నెట్ స్లోగా రన్ అవుతుంది. అప్పుడు మొబైల్ నెట్వర్స్ సెట్టింగ్స్ ను ఒకసారి రీస్టార్ట్ చెయ్యడం మంచిది.

ఇవి కూడా చదవండి

ఒన్ ప్లేస్ : కిల్లింగ్ ప్రైజ్ లో.. సూపర్ ఫీచర్స్ ..మిస్ చేయొద్దు !

వావ్ : వాట్సప్ కొత్త ఫీచర్స్ .. అదిరిపోయింది గురూ !

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -