Monday, April 29, 2024
- Advertisement -

మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా.. జాగ్రత్త !

- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కొన్ని అలవాట్లు మనం మర్చిపోలేకపోతుంటాం. అయితే వాటిలో కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. అలాగే చెడు అలవాట్లు కూడా ఉంటాయి. అయితే మంచి చెడు అలవాట్ల గురించి కాస్త పక్కన పెడితే కొన్ని హ్యాబిట్స్ కు మనం బానిసలంగా మారుతూ ఉంటాము. అలాంటి అలవాట్లను మర్చిపోవాలని ఎంత ప్రయత్నించిన మర్చిపోలేక సతమతమౌతు ఉంటాము. తీర అలాంటి అలవాట్లే అనారోగ్యానికి దారి తీస్తాయి. మరి అలాంటి కొన్ని హ్యాబిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. !

  1. మాంసాహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం.
    చాలమంది మాంసహారాన్ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు.రోజుకు రెండు మూడు సార్లు మాంసాహారం సేవించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మాంసాహారం తినడం వల్ల శరీరానికి మంచిదే. మంచి ప్రోటీన్స్ మన శరీరానికి పుష్కలంగా అందుతాయి. అయితే మితంగా తింటే మంచిదే కాని.. అమితంగా తిన్నప్పుడే అసలు సమస్యలు మొదలౌతాయి. మాంసాహారం అధికంగా సేవించేవారికీ బద్దకం ఆవహిస్తుంది. ఇక మాంసాహారం అధికంగా తినే వారు శరీరానికి తగినంత శ్రమ అందించకపోతే.. బాడీలో కొలెస్ట్రాల్ అధికంగా పెరుగుతుంది. ఫలితంగా గుండె సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి.
  2. ఫోన్ వాడకం

నేటి రోజుల్లో మొబైల్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే.చిన్న పెద్ద తేడా లేకుండా మొబైల్ వాడుతూ ఉంటారు. అయితే మొబైల్ అధికంగా వాడడం వల్ల ఎన్నో సమస్యలు మన చుట్టూ ఆవహిస్తాయి. మొబైల్ అధికంగా వాడడం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతే కాకుండా మొబైల్ కు బానిస కావడం వల్ల మానసిక రుగ్మతలు ఏర్పడి.. తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

  1. ఒంటరితనం
    చాలమందికి ఒంటరి తనం ఒక అలవాటుగా ఉంటుంది. ఒంటరితనానికి అలవాటు పడ్డ వారు.. అందరిలోనూ కలిసేందుకు ఏమాత్రం ఇష్టపడరు. ఇలా ఒంటరిగా గడపడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒంటరిగా గడిపే వారిలో శరీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు ఏర్పడతాయని, అది అలాగే కొనసాగితే మనుషుల్లో కలిసేందుకు ఫోబియా ఏర్పడుతుందని, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఒంటరిగా ఉండానికి ఇష్టపడే వారు.. వీలైనంత సేపు అందరిలోనూ కలిసి సరదాగా మాట్లాడే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

కడుపునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి !

మీ జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే టిప్స్ !

చిన్న వయసులోనే గుండె పోటు రావడానికి కారణాలు ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -