Monday, May 20, 2024
- Advertisement -

జగన్‌పై రాతల్లో ఉన్న విలువలు చేతల్లో ఏమయ్యాయ్ రాధాకృష్ణా? న్యాయ వ్యవస్థపై గౌరవం ఇంతేనా?

- Advertisement -

విలువలు వల్లించమంటే విశ్వానికంతా చెప్పడానికి రాధాకృష్ణ రెడీ…. నీతులు బోధించడంలో ప్రపంచంలోనే నిప్పును మించినవాడు లేడు…. రాష్ట్ర విభజన సమయంలో అయితే సీమాంధ్రులకు రాధాకృష్ణ ఎన్ని నీతులు చెప్పాడో….ఎంత ఎటకారం చేశాడో లేక్కేలేదు. కానీ ఏం చేస్తాం….ఒక కులానికి కొమ్ముకాస్తాడని, టిడిపికి భజన చేయడంలో అంతకుమించిన వాడు లేడని కొంతమంది సీమాంధ్రులు రాధాకృష్ణను కూడా పొగుడుతూ ఉంటారు. ఇక ప్రత్యేక హోదా విషయంలో సీమాంధ్రకు రాధాకృష్ణ చెప్పింది నీతులే. చేసింది ఎటకారమే. ఇక వైఎస్‌ల విషయంలో అయితే రాధాకృష్ణ మామూలుగా రెచ్చిపోడు. వైఎస్‌ల వ్యక్తిత్వాన్ని హననం చేయడంలోనూ తన గురించి తాను డప్పు కొట్టుకోవడంలోనూ రాధాకృష్ణవి చేయితిరిగిన రాతలు. అందులో జర్నలిజం విలువలు మాత్రం అస్సలు ఉండవు. సోనియా, జగన్‌లు మాత్రమే ఉన్న మీటింగ్‌లో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో చెప్పగలడు. ఇంకా ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి-విజయమ్మ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి-జగన్, జగన్-భారతి, జగన్-షర్మిలలు కూడా పరస్పరం వాళ్ళిద్దరే ఏం మాట్లాడుకున్నారో చెప్పగల ఘనుడు రాధాకృష్ణ. అయితే రాధాకృష్ణ రాతల పరమార్థం ఒక్కటే. చంద్రబాబు నిప్ప, రాధాకృష్ణ నిప్పున్నర….ఇక బిన్ లాడెన్, వీరప్పన్‌లాంటి వాళ్ళు టిడిపిలో చేరినా వాళ్ళు వెంటనే పులుకడిగిన ముత్యం అయిపోతారు. అయితే బాబుకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు మాత్రం రాక్షసులు, విలువలు లేని వాళ్ళు. మరీ ముఖ్యంగా పచ్చ బ్యాచ్ మొత్తానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైఎస్ జగన్ అయితే చెప్పక్కర్లేదు……..రాధాకృష్ణ రాతలను పదేళ్ళుగా చదువుతున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మరి అంతటి విలువల సంపన్నుడు, వ్యవస్థలను గౌరవించేవాడు అయిన రాధాకృష్ణను అరెస్ట్ చేయమని చెప్పి కోర్ట్ ఆదేశించింది. ఎందుకు?

ఎందుకంటే కోర్టులు మరీ సామాన్య ప్రజలంత అమాయకంగా ఉండవుగా. మరీ ముఖ్యంగా రాధాకృష్ణ సీమాంధ్రకు వ్యతిరేకంగా ఎంతటి ద్రోహ పూరిత వార్తలు రాసినా నెత్తినపెట్టుకుని ఊరేగే బాబు బ్యాచ్‌లా ఉండవుగా. పచ్చ బ్యాచ్‌కి అనుకూలంగా ఉంటే చాలు….. సీమాంధ్రను నిలువునా ముంచినా సరే…… ఎవ్వరినీ ఏమీ అనరు. కిరణ్ కుమార్‌రెడ్డితో రహస్య స్నేహం. సోనియాతో మంతనాలు, ఇప్పుడు మూడేళ్ళుగా విభజనతో అన్నీ నష్టపోయిన సీమాంధ్రకు కనీస సాయం కూడా చేయని నరేంద్రమోడీ….అందరి విషయంలో పచ్చ బ్యాచ్‌ది ఒకటే ఫిలాసఫీ. వాళ్ళ తప్పులు కాస్తూ జగన్‌కి వ్యతిరేకంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉంటే చాలు…..సీమాంధ్ర ఎటుపోతే మాత్రం ఏంపోయింది? హోదా, రైల్వే జోన్‌లాంటివి ఇవ్వకుండా సీమాంధ్రులను ఎంత దగా చేస్తే మాత్రం పచ్చ బ్యాచ్‌కి ఏంపోయింది?

కోర్టులను గౌరవించడు…… ఆ మాటకొస్తే దేశంలో ఉన్న ఏ వ్యవస్థను కూడా గౌరవించడు అని జగన్‌పై ఎన్ని రాతలు రాశారు. ఎన్ని నీతులు చెప్పారు? ఆ రాతలు-నీతులు ఈ రోజు ఏమైపోయాయి? కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకోవడానికి దొంగ మాటలు మాట్లాడడం…..అసెంబ్లీ కవరేజీలో బిజీగా ఉన్నాడట….హవ్వ……నవ్విపోదురుగాక…..అసెంబ్లీ సమావేశాలతో పత్రికా సంపాదకుడు బిజీగా ఉండడం ఏంటి? అదే ప్రశ్నను కోర్టు కూడా ప్రశ్నించింది. ప్రజల కష్టాలు తెలుసుకుంటాను, ప్రజల కోసం పాదయాత్ర చేస్తాను అని ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చెప్తే ఇదే రాధాకృష్ణ ఎంత ఎటకారం చేశాడు? ఇప్పుడు రాధాకృష్ణలా అప్పుడు జగనేమీ అబద్ధం చెప్పలేదా? తాను పాదయాత్ర చేయాలనుకున్నాడు….అదే విషయం కోర్ట్‌కు చెప్పాడు. అంతేకానీ దొంగ మాటలు, అబద్ధాలు చెప్పలేదుగా? కోర్ట్ జగన్‌కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ కోర్ట్‌ని గౌరవిస్తున్నాడు. జగన్‌పైన కోపంతో సోనియా గాంధీనే జగన్‌పై కేసులు పెట్టించింది అని ఈ మధ్యనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు పార్టీలో చేరిన సందర్భంగా సాక్షాత్తూ బాబే చెప్పాడు. ఇక ఆ కేసులో టిడిపివాళ్ళు ఇంప్లీడ్ అయిన విషయం కూడా తెలిసిందే. కచ్చితంగా రాజకీయ కక్ష్యనే అని చెప్పొచ్చు. అయినప్పటికీ జగన్ మాత్రం వ్యవస్థలను గౌరవిస్తూనే ఉన్నాడు. మరి రాధాకృష్ణ ఏం చేశాడు? కోర్ట్ చెప్పినట్టుగా వినలేదు. ఇప్పుడు అరెస్ట్ వరకూ తెచ్చుకున్నాడు. ఇలాంటి పనులు జగన్ ఎప్పుడైనా చేశాడా? ఎవరికి విలువలు ఉన్నట్టు? ఎవరు వ్యవస్థలను గౌరవిస్తున్నట్టు? చెప్పేవి శ్రీరంగనీతులు సామెత ఊరికినే పుట్టుకువచ్చిందా?

ఇక ఇప్పుడు రాధాకృష్ణను అరెస్ట్ చేయమని కోర్ట్ చెప్పిన కేసు ఏంటో తెలుసా? ఆ మధ్య ‘అమ్మ…జగనా?’ అంటూ ప్రధానితో జగన్ మీటింగ్‌ని నానా రకాలుగా వక్రించి రాసి ఎటకారం చేశాడు. షరామామూలుగానే మోడీని తన వ్యక్తిగత స్వార్థం కోసం, కేసుల మాఫీ కోసం జగన్ కలిశాడని రాసుకొచ్చాడు. తన సెక్యూరిటీని కూడా వదిలేసి చంద్రబాబు ఢిల్లీలో నాలుగ్గంటలు మాయమైపోయినా….చంద్రబాబు తనను రహస్యంగా కలిశాడని చిదంబరం చెప్పినా………అవన్నీ జనోద్ధారణ కోసమే అని రాస్తారు. అదే జగన్ కనుక ప్రధానికి అధికారికంగా కలిసినా కూడా కేసుల మాఫీ కోసం అని రాస్తారు. వైకాపా వాళ్ళు మాత్రం ఎన్ని సార్లు భరిస్తారు. అందుకే కోర్టులో కేసు వేశారు. ఆ కేసును ఎదుర్కోవడానికి రాధాకృష్ణ ఆడుతున్నా డ్రామాలు, పడుతున్న పాట్లు చూస్తుంటేనే అర్థమవడం లేదు…….ఆయన రాతలు ఎంతమేరకు నిజాలో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -