Saturday, April 20, 2024
- Advertisement -

రాజ‌ధాని నిర్మాణంలో మొహం చాటేస్తున్న సింగ‌పూర్ సంస్థ‌లు.. కార‌ణం అదేనా…?

- Advertisement -

కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో మోదీ చంద్ర‌బాబుకు షాక్ ఇస్తే ఇప్పుడు తాజాగా మ‌రో సారి సింగ‌పూర్ షాక్ ఇచ్చిది. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో సింగ‌పూర్‌ను నెత్తిన పెట్టుకొని ఊరేగారు. రాజ‌ధాని అమ‌రావ‌తిని సింగ‌పూర్‌లాగా చేస్తాన‌ని ఊద‌ర‌గొట్టారు. సింగ‌పూర్ మంత్రులు, పారీశ్రామిక వేత్త‌ల‌కు రెడ్ కార్పెట్ ప‌రిచారు బాబుగారు. అయితే ఇప్పుడు మాత్రం సింగ‌పూర్ సంస్థ‌లు, మంత్రులు ఏపీవైపు క‌న్నెత్తికూడా చూడ‌టంలేదంట‌.

ప్ర‌జ‌ల‌నుంచి రాజ‌ధానికోసం 33 వేల ఎక‌రాల‌ను సేక‌రించిన ప్ర‌భుత్వం ..అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించి సింగపూర్ సంస్థలకు స్విస్ ఛాలెంజ్ విధానంలో అమరావతిలో ‘‘స్టార్టప్ ఏరియా’ ప్రాజెక్టు అప్పగించినా..అవి ఎందుకు ముందుకు రావటం లేదు.

దీనికి ప్ర‌ధాన‌కార‌ణం వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబు అధికారంలోకి రావ‌డంపై సందేహంతో ఉన్నాయ‌ని అందుకే …ఇలాంటి త‌రునంలో వంద‌ల‌, వేల కోట్ల రూపాయ‌లు పెట్టిబ‌డులు పెట్టి స‌మ‌స్య‌లు తెచ్చుకోవ‌డం ఎందుక‌ని ఆలోచిస్తున్నాయంట‌. అందుకే ఇప్పుడు ఏసంస్థ‌లు పెట్టుబ‌డిపెట్ట‌డానికి ముందుకు రావ‌డంలేద‌ని అధికార‌వ‌ర్గాలు అంటున్నాయి.

వాస్తవానికి ఈ ప్రాజెక్టులో సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి చాలా నామమాత్రమే అయినా కూడా ఈ సంస్థలు వెనకంజ వేస్తున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం మారితే తమకు చిక్కులు తప్పవనే భయంతో సింగపూర్ సంస్థలు ఉన్నాయని..ఏమైనా కూడా అవి వచ్చే ఎన్నికల ఫలితాల చూసిన తర్వాతే తమ పనులు ప్రారంబించే అవకావం ఉందని చెబుతున్నారు. అందుకే సర్కారు స్విస్ ఛాలెంజ్ విధానం కింద ప్రాజెక్టు అప్పగించి ఎనిమిది నెలలు దాటినా పనులు మొదలుపెట్టకుండా కొత్త కొత్త ఆంక్షలు పెడుతున్నాయని చెబుతున్నారు.

సింగ‌పూర్ సంస్థ‌ల‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అంత సులువుకాదనే అభిప్రాయంతో ఉన్నందునే ఆచితూచి స్పందిస్తున్నాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అంత సులువుకాదనే అభిప్రాయంతో ఉన్నందునే ఆచితూచి స్పందిస్తున్నాయని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -