Friday, March 29, 2024
- Advertisement -

ఈ కాకరకాయ వేపుడు తింటే లొట్టలేయాల్సిందే!

- Advertisement -

సాధారణంగా కాకరకాయ వేపుడు తినడానికి చాలా మంది ఇష్టపడరు. కాకరకాయ చేదుగా ఉండటమే అందుకు కారణం. అయితే కాకరకాయ చేదు లేకుండా, ఎంతో రుచిగా తయారు చేసుకుంటే మరోసారి కాకరకాయ తినాలనిపిస్తుంది. మరి చేదు లేకుండా కాకరకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:
కాకరకాయలు అరకిలో, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, టమోటాలు ఒక కప్పు, కరివేపాకు రెమ్మ, బెల్లం రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత.

తయారీ విధానం:
కాకరకాయ వేపుడు తయారుచేయడానికి రెండు గంటల ముందే కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అందులోకి తగినంత ఉప్పు కలిపి ఒక గుడ్డలో కట్టి పెట్టాలి.

*ఈ లోగ కాకరకాయ నుంచి చేదు రసం బయటకు వెలువడుతుంది.కాకరకాయ వేపుడు తయారు చేయడానికి ముందు గట్టిగా గుడ్డను పిండటం వల్ల మరింత చేదు బయటకు వెళ్ళిపోతుంది.

*ఈ కాకరకాయ ముక్కలను ఐదు నిమిషాల పాటు ఆరబెట్టి ఆ తరువాత డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేడి చేసుకుని అందులో వేయించుకోవాలి.

*ఈ విధంగా వేయించి కాకరకాయ ముక్కలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గోళం పెట్టి అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నూనె వేడెక్కిన తరవాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలను వేయాలి.

Also read:అమ్మాయిలను ఏడిపిస్తున్న జబర్దస్త్ టీమ్ లీడర్.. ఎవరంటే?

*ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులోకి టమోటా ముక్కలు వేయాలి.

*టమోటా ముక్కలు కొద్దిగా మెత్తబడగానే ఇందులోకి ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలను వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై మగ్గనివ్వాలి.

*ఐదు నిమిషాల తర్వాత ముందుగానే మనం కాకరకాయలోకి ఉప్పు వేసి ఉంటాము. కనుక రుచి చూసుకుని అవసరమైతే కొద్దిగా కలుపుకోవాలి. అదేవిధంగా చిటికెడు పసుపు కారం వేసి తక్కువ మంటపై బాగా కలియబెట్టాలి.

Also read:యాంకర్ రవిపై అషు రెడ్డి డబుల్ మీనింగ్ డైలాగులు?

*కారం వేసిన రెండు నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేసి కలియబెట్టిమరో రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేదు లేకుండా ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు తయారైనట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -