ఆ పత్రికపై విరుచుకుపడ్డ రకుల్ ప్రీత్.. కారణం?

- Advertisement -

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో అగ్రకథానాయికగా కొనసాగుతూనే బాలీవుడ్‌లో అడుగుపెట్టి పలు విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. టాలీవుడ్లో ఇటీవలే విడుదలైన “చెక్ “మూవీ ఆశించినంత విజయం సాధించలేదనే చెప్పాలి.దీంతో టాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌ ముగిసిందని, ప్రస్తుతం ఆమెకు అక్కడ సినిమా అవకాశాలు రావడంలేదని రకుల్‌ స్వయంగా చెప్పినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రికలో ప్రచురించిన విషయం తెలిసిందే.

తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆ పత్రికపై మండిపడుతూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో దాదాపు 6 భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాను.ఒక్క ఎడాదిలో ఇంతకంటే ఎక్కువ సినిమాలు చేయగలమా. అయితే కొత్త ఆఫర్స్‌ కోసం దయచేసి నా డేట్స్‌ సర్దుబాటు చేయండి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే మా టీమ్‌కి సాయం చేయండి అంటూ తన ఆవేదనను వ్యక్త పరుస్తూ సోషల్ మీడియాలో ట్వీట్‌ చేసింది.

- Advertisement -

Also read:ఒకప్పటి ఫోటో షేర్ చేసిన వర్మ..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా రకుల్ చేసిన ట్వీట్‌ పై స్పందిస్తూ ఇటీవల నా స్నేహితుడు రాసిన స్క్రిప్ట్‌ నీకు బాగా నచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్స్‌ కోసం నీ డేట్స్‌ సర్దుపాటు ​చేయడానికి నువ్వు ఎంతగా ప్రయత్నించావో తెలుసు. చివరకు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది.ఇలాంటి అనవసరపు వ్రాతలకు నువ్వు స్పందించాల్సిన పని లేదు.అంటూ హరీష్ శంకర్ రకుల్ చేసిన ట్వీట్‌ పై స్పందించారు.రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో రకుల్‌ ప్రీత్ సింగ్ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Also read:డిన్నర్ రన్ అంటూ చీరకట్టులో పరిగెత్తుతున్న తాప్సి!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -