Friday, May 3, 2024
- Advertisement -

కమ్మటి రుచిని ఇచ్చే టమోటా రసం.. ఎలా చేయాలంటే?

- Advertisement -

సాధారణంగా మన రోజు భోజనంలో టమోటా రసం లేనిదే భోజనం పూర్తి కాదు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికి వెళ్ళినా మనకు మధ్యాహ్న భోజనంలో టమోటో రసం తప్పనిసరిగా ఉంటుంది. మరి కమ్మటి రుచి, సువాసన కలిగిన టమోటో రసం ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:
బాగా పండిన టమోటా పండ్లు 5, నిమ్మ పండు సైజు చింతపండు, టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ రసం పొడి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు, కరివేపాకు రెమ్మ, ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు పది, ఆవాలు జీలకర్ర టేబుల్ స్పూన్, కొత్తిమీర తురుము రెండు టేబుల్ స్పూన్లు, నూనె తగినంత.

తయారీ విధానం:
*ముందుగా టమోటా పండ్లను శుభ్రంగా కడిగి రెండు ముక్కలుగా చేసుకుని, ఇందులోకే చింతపండు గ్లాస్ నీటిని వేసి బాగా ఉడకబెట్టాలి.

*టమోటా పండ్లు ఉడికిన తర్వాత వాటిని కాస్త చల్లార్చి బాగా మెదపాలి. ఈ విధంగా టమోటా మెత్తగా మారిన తరువాత ఆ పులుపుకు సరిపడా నీటిని వేసుకోవాలి.

*ఈ టమోటా రసంలోకి తగినంత ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి.

*స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత పోపుకోసం ఆవాలు జీలకర్ర వేయాలి.

Also read:ఒకప్పటి ఫోటో షేర్ చేసిన వర్మ..?

*ఆవాలు చిటపట అన్న తరువాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పచ్చి కరివేపాకు వేయాలి.

*ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా మగ్గిన తర్వాత రసం పొడి వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రసం పొడి మంచి సువాసన రాగానే ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో పోయాలి.

Also read:అందుడిగా అల్లు అర్జున్… ఆ సినిమా కోసం అంత సిద్ధం!

*ఈ విధంగా రసం ఒక పది నిముషాల పాటు బాగా ఉడకనివ్వాలి.పదినిమిషాల తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుము వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుంటే రుచికరమైన టమోటో రసం తయారైనట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -