Wednesday, April 24, 2024
- Advertisement -

వ్యూహాత్మ‌కంగానె వెంక‌య్య‌ను త‌ప్పించారా…?

- Advertisement -

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఊహించినట్టుగానే వెంకయ్యనాయుడు పేరుని బీజేపీ నాయకత్వం ప్రకటించింది. తాను క్రియాశీల రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజలతో మమేకమవుతూ ఉండడమే తనకు ఇష్టమని తెలిపినా చివ‌రికి పార్టీ అధిష్టానానికి క‌ట్టుబ‌డి ఉండాల్సి వ‌చ్చింది.అయితే వెంక‌య్య‌ను వ్యూహాత్మ‌కంగానె ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌నుంచి త‌ప్పించార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.
ఉత్త‌రాదిలో భాజాపా కు తిరుగులేదు.కాని ద‌క్షిణాదిలోకూడా పార్టీని విస్త‌రించాల‌ని అమీత్‌షా,మోదీ గ‌ట్టినిర్న‌యంతో ఉన్నారు.ముఖ్యంగా ఏపీమీద‌నె భాజాపా పోక‌స్ పెట్టింది.అయితే ఒంట‌రిగా ఎద‌గాల‌ని భావిస్తున్న పార్టీ టీడీపీతో పోత్తు ప్ర‌ధాన అడ్డంకిగా మారింద‌నే చెప్ప‌వ‌చ్చు.
ఏపి లో బిజెపి ఎదుగుదలకి వెంకయ్య పెద్ద అడ్డుగా ఉన్నమాట నిజం. దేశంలో ఇతర రాష్ట్రాలలో వెంకయ్య బిజెపి కి సేవ చేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆయన ప్రాధాన్యత తన కులానికే అన్నది సుస్పష్టం. ఏపి లో బిజెపి ఎదగాలని వెంకయ్య ఏమాత్రం అనుకున్నా నోటిలో నాలుకలేని, ముఖ్యమంత్రి చంద్రబాబు కులానికే చెందిన కంభంపాటి హరిబాబుని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగనిచ్చే వారు కాదు.
చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై సోము వీర్రాజు తెదేపాని గట్టిగా విమర్శిస్తున్నారు. తెదేపా బిజెపి దోస్తీకి మంచిది కాదని భావించిన వెంకయ్య సోము వీర్రాజు ని అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్నారని బిజెపి వర్గాలు అంటున్నాయి. కాపు కులానికి చెందిన ఎవరికైనా బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే బిజెపి కి ఎదిగే అవకాశం ఉండేది. ఇప్పుడు వెంకయ్యకి ఇష్టం లేకపోయినా ఆయనకి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి పక్కనబెడుతున్నారు కాబట్టి, ఇప్పుడు అమిత్ షా ఏపి లో బిజెపి బలోపేతంపై దృష్టి పెట్టవచ్చు. ఈ రకంగా చూస్తే, వెంకయ్యకు పదోన్నతి ద్వారా ఏపి బిజెపి కి అడ్డు తొలగిందని అనుకోవచ్చు.
గ‌తంలో ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమీత్‌షా కొన్ని సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కార్య‌క‌ర్త‌లు టీడీపీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.2019 ఎన్నిక‌ల్లో పొత్తు వ‌ద్ద‌ని ఒంట‌రిగా పోటీచేయాల‌ని ప్ల‌కార్డుల‌తో త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.అప్ప‌టినుంచి అమీత్‌షా ఏపీపైనె దృష్టిసారించారు.
వెంకయ్యని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా ఏపి కి అండ పోయిన మాట నిజమే, బిజెపి ఎదుగుదలకి అడ్డు తొలగిన మాటా నిజమే.మ‌రి భాజాపా ఛీప్ వ్యూహాలు ఏమాత్రం ప‌లిస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -