Saturday, May 11, 2024
- Advertisement -

అరుపులు, కేకలు, పెడబొబ్బలు……. చంద్రబాబుకు ఎందుకంత భయం?

- Advertisement -

నిప్పులా బ్రతికా…….. ఏ తప్పూ చేయలేదు, కోర్టులు కూడా నన్నేమీ చేయలేవు, ఎవ్వరూ ఏమీ చేయలేరు, జన్మలో తప్పు చేసి ఎరుగను…..అవకాశం వచ్చినప్పుడల్లా ఇలా కన్నార్పకుండా చెప్పుకుంటూపోతూ ఉంటాడు చంద్రబాబు. మరి ఆ స్థాయి నిజాయితీపరుడు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోతున్నాడు. బాబు అండ్ కో అందరిలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం కనిపిస్తోంది.

అందుకే ఎటుండి ఎటొచ్చినా …….. ఎందుకైనా మంచిదని కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో బాబు రచించే ముందు జాగ్రత్త వ్యూహాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వైకాపా ఎంపిల రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా జగన్ బిజెపితో కుమ్మక్కయ్యినట్టే…… ఒకవేళ ఆమోదించకపోయినా బిజెపితో కుమ్మక్కయినట్టే అని ప్రచారం చేయడానికి అనుకూలంగా చంద్రబాబు వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు నరేంద్రమోడీ ఎక్కడ సిబిఐ ఎంక్వేరీ వేస్తాడో? ఎక్కడ జైలుకు పంపిస్తాడో? అన్న భయంతో కూడా ఇలాంటి వ్యూహాలనే రచించాడు చంద్రబాబు. సిబిఐ ఎంక్వైరీ వేసి చంద్రబాబు జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తే…….అంతా మోడీ కుట్ర అని అరిచిగోల పెట్టడానికి బాబుతో సహా ఆయన భజన బృందం మొత్తం రెడీ. ఒక వేళ అలాంటిది ఏమీ జరగకపోతే మాత్రం …….మోడీకి మా బాబును టచ్ చేసే ధైర్యం ఉందా? నిప్పు అక్కడ అని సినిమాల్లో బాలకృష్ణ కొట్టేలాంటి డైలాగులు కొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు టిడిపి జనాలు.

ఈ వ్యవహారం అంతా అర్థమైన జనాలకు మాత్రం ‘కెమేరామేన్ గంగతో రాంబాబు’ సినిమాలో బ్రహ్మానందం ఎపిసోడ్ గుర్తొస్తుంది. ఎటుండీ ఎటొచ్చినా……ఎందుకైనా మంచిదన్న ఉధ్ధేశ్యంతో అందులో బ్రహ్మానందం కూడా ముందు జాగ్రత్త వ్యూహాలు రచించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు బాబు అండ్ కో పరిస్థితి కూడా అదే. అయినా నిప్పు, జన్మలో ఏ తప్పూ చేయలేదు అని జనాల చెవుల తుప్పు వదిలేలా చెప్పుకునే చంద్రబాబుకు ఈ స్థాయిలో భయాలు, గుండెదడ ఎందుకు అన్నదే అది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తే ముసుగు లేని చంద్రబాబు ఇట్టే కనిపించేస్తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -