Saturday, May 4, 2024
- Advertisement -

దట్ ఈజ్ కోహ్లి…… కుమ్మేసిన టీం ఇండియా…. హిస్టరీలో ఇదే ఫస్ట్

- Advertisement -

ఇప్పటి వరకూ ఇండియా తరపున క్రికెట్ ఆడిన ప్లేయర్స్ అందరికంటే కూడా ఫైటింగ్ స్పిరిట్ విషయంలో కపిల్‌దేవ్, సౌరవ్‌గంగూలీని గొప్పగా చెప్తూ ఉంటారు క్రిటిక్స్. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లి మాత్రం వాళ్ళిద్దరినీ కూడా మించిపోయేలా ఉన్నాడు. దశాబ్ధాలపాటు డిఫెన్సివ్ గేంకి పరిమితమైన టీం ఇండియాకు పోరాటం నేర్పించింది కపిల్ దేవ్‌నే. ఆ తర్వాత దెబ్బకు దెబ్బ తీయడం మాత్రం గంగూలీ నేర్పించాడు. అయితే ఇప్పుడు కోహ్లి మాత్రం ఓటమన్న మాటే వద్దు…..గెలుపు మాత్రమే కావాలి అంటూ గంగూలీ దూకుడు, కపిల్ దేవ్ పోరాటాన్ని కలిపి టీం ఇండియాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళుతున్నాడు. ఇప్పటికే వ్యూహాత్మకంగా చేసిన తప్పిదాలతో…….కోహ్లి మినహా ఇతర బ్యాట్స్‌మేన్ అందరూ కూడా విఫలమైన నేపథ్యంలో ఈ రోజు చివరి టెస్ట్ గెలుపు కోసం కోహ్లి చేసిన పోరాటం నిజంగా అభినందిందగ్గదే.

ఆమ్లా-ఎల్గర్‌లు వందకు పైగా పార్ట్నర్‌షిప్ నెలకొల్పడంతో టీం ఇండియా ప్లేయర్స్ కూడా డల్ అయిన పరిస్థితి. అయినప్పటికీ కోహ్లి మాత్రం అనుక్షణం తన ఫాస్ట్ బౌలర్స్‌ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు సరైన దిశానిర్దేశం చేశాడు. ముందుగా ఆమ్లాని బోల్తా కొట్టించడం కోసం ఇశాంత్ శర్మతో కలిసి చేసిన ప్లాన్ అయితే సూపర్బ్. ఇక ఆ తర్వాత నుంచీ ఒక్క స్పిన్నర్‌ని కూడా వద్దనుకుని కోహ్లి పూర్తిగా నమ్మకం పెట్టుకున్న ఫాస్ట్ బౌలర్స్ షమి, భువీ, బుమ్రా, ఇశాంత్‌లు అద్భుతమైన బౌలింగ్………అది కూడా ఫాస్ట్ బౌలింగ్ ఎలా ఉంటుందో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కి చూపించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్స్‌కి ఏమాత్రం తగ్గని స్థాయిలో సూపర్బ్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవర్సీస్‌లో అందరూ ఫాస్ట్ బౌలర్స్‌తోనే ఆడి ఇండియా గెలిచిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇదే. సిరీస్ మొత్తం కూడా సౌత్ ఆఫ్రికాకు సూపర్ ఫైట్ ఇచ్చిన కోహ్లి సేన చివరి టెస్ట్‌లో కోహ్లితో పాటు రహానే, పూజారాలు కూడా రాణించడం, భువీ, బుమ్రా, షమీ, ఇశాంత్‌లు అద్భుతమైన బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా రాణించడంతో సౌత్ ఆఫ్రీకాను సౌత్ ఆఫ్రికా గడ్డపై……అత్యంత టఫ్ పిచ్‌పై ఘోరంగా ఓడించింది. కోహ్లి సేనను ఇప్పుడు అందరూ కూడా ఆకాశానికెత్తుతుండడం గమనార్హం. భారత మాజీలతో పాటు అంతర్జాతీయ క్రికెటర్స్ కూడా కోహ్లి సేనపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. శభాష్ కోహ్లి అండ్ టీం.

సిరీస్ మొత్తం మీద ఇరు జట్ల తరపున కూడా సెంచరీ చేసిన ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్ టీం ఇండియానే కెప్టెన్ విరాట్ కోహ్లినే కావడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -