Wednesday, April 24, 2024
- Advertisement -

భారత్ కు ” స్పెషల్ విక్టరీ “!

- Advertisement -

ఇండియా, ఇంగ్లాండ్ మద్య జరుగుతున్నా మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. లండన్ లోని కేన్నింగ్టన్ ఓవల్ లో జరిగిన తొలి వన్డేలో భారత్ అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ను కేవలం 110 పరుగులకే కుప్పకూల్చింది భారత్ బౌలింగ్ దళం. ఇక ఆ తరువాత స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ సేన ఒక్క వికెట్ కోల్పోకుండా పది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లను తక్కువ స్కోర్ కె పరిమితం చేయడంలో భారత బౌలర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బుమ్రా తన కెరియర్ లోనే బెస్ట్ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.

తన బుల్లెట్ బంతులతో కేవలం 19 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటర్ల నడ్డి విరిచాడు. బుమ్రా కు తోడు మహ్మద్ షమి కూడా మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ఓటమిలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ ( 58 బంతుల్లో 76 పరుగులు : 6 పొర్లు ,5 సిక్సులు నాటౌట్ ), శికర్ ధావన్ ( 54 బంతుల్లో 31 పరుగులు : 4ఫోర్లు నాటౌట్ ) చేసి వికెట్ పడకుండా విజయలాంచనాన్ని తమదైన స్టైల్లో ముగుంచారు. దీంతో సిరీస్ లో ఇండియా 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ విజయం భారత్ సాధించిన అత్యుత్తమ విజయలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియా ప్రత్యర్థి జట్టుపై పది వికెట్ల తేడాతో ఆరు సార్లు గెలిచింది. ఈ మ్యాచ్ తో ఏడవసారి ఆ ఫిట్ సాధించింది. అయితే పది వికెట్ల తేడాతో ఇప్పటివరకు భారత్ చిన్న జట్లపైనే గెలిచింది. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు, డిఫెండింగ్ వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్ పై పది వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకోవడం నిజంగా స్పెషల్ విక్టరీ అంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -