Friday, March 29, 2024
- Advertisement -

కుర్రాళ్లు అడుగుపెట్టారు.. అద‌ర‌గొట్టారు

- Advertisement -

ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టు సిరీస్ విజ‌యంలో టీమిండియా యువ ఆటగాళ్ల పాత్ర మ‌రువ‌లేనిది. కెప్టెన్ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, షమీ, ఉమేశ్‌ యాదవ్‌, బుమ్రా, జడేజా, అశ్విన్ వంటి కీలక మ్యాచుల్లో లేకపోయినప్పటికీ జట్టు విజయం సాధించడంలో ప్ర‌ధాన పోషించారు. ముఖ్యంగా అరంగేట్ర క్రికెట‌ర్లు శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్, నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్, టి.నటరాజన్ అద్భుతంగా రాణించి అద‌ర‌హో అనిపించారు.

సూప‌ర్ సిరాజ్‌‌..
హైదరాబాదీ బౌలర్ రెండో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో 13 వికెట్లు తీసి సత్తా చాటాడు.అతిసాధారణ కుటుంబం నుంచి వచ్చిన సిరాజ్‌.. టూర్‌లో ఉండగానే తండ్రి మరణించినా.. బాధ త‌ట్ట‌కుని జట్టుతోనే ఉండిపోయాడు. బాక్సింగ్‌ డే టెస్టుతో పాటు గ‌బ్బా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

షైన్ అయిన సైనీ
రైట్‌ ఆర్మ్‌ మీడియం బౌలర్‌. సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ గాయపడటంతో సిడ్నీ టెస్టుతో సంప్రదాయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ టెస్టు సిరీస్‌లో మొత్తంగా 4 వికెట్లు పడగొట్టాడు.

న‌ట్టూ భాయ్ సూప‌ర్‌
త‌మిళ‌నాడు పేస‌ర్‌. ఆసీస్‌ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికైన నటరాజన్‌ మనుకా ఓవల్‌ మైదానంలో వన్డే మ్యాచ్‌ ద్వారా జాతీయ జట్టులో ప్ర‌వేశించాడు. అనంతరం టీ20, గబ్బా మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. ఆసీస్ టూర్‌లో మొత్తంగా11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీశాడు.

వాషింగ్ట‌న్ స‌త్తా చాటాడు
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ వన్డేల్లో అడుగుపెట్టాడు. గబ్బా మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సుందర్‌.. 4 వికెట్లు తీసి సత్తా చాటాడు.

అద‌ర‌గొట్టిన గిల్‌
శుభ్‌మన్‌ గిల్‌ కూడా ఈ సిరీస్‌ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తంగా 259 పరుగులతో జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. మంచి ఓపెన‌ర్ అనిపించుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -