Friday, April 19, 2024
- Advertisement -

అశ్విన్ ప్రపంచంలోకెల్లా నెం.1 స్పిన్న‌ర్ : హ‌ర్భ‌జ‌న్

- Advertisement -

భార‌త ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అంటే తనకు ఈర్శ్య కాదని క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ అన్నారు. తమిద్దరి మధ్య మంచి ఫ్రెండిషిప్ ఉందని స్పష్టం చేశాడు. అంతేకాకుండా ప్రపంచంలోకెల్లా నెం.1 ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ అని ప్రశంసించాడు. వాస్తవానికి అశ్విన్ రాకముందు టీమిండియాలో హ‌ర్భ‌జ‌న్ సింగ్ రెగ్యుల‌ర్‌గా ఆడుతుండే వాడు.

అయితే అశ్విన్ తన అద్భుతమైన ప్రదర్శనలతో తన చోటుని సుస్థిరం చేసుకోవడంతో.. ఫామ్ కోల్పోయి.. గాయాల కారణంతో భజ్జీ జాతీయ జట్టు నుంచి దూరమయ్యాడు. అయితే తమ ఇద్దరికి పడదని.. తమ మధ్య ఈర్శ్య ఉందని చాలా మంది అనుకుంటారని.. కానీ అందులో ఎలాంటి నిజం లేదని భజ్జీ క్లారిటీ ఇచ్చాడు. ఇంకోవైపు ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్న‌ర్ నాథ‌న్ ల‌యోన్‌పై కూడా ప్ర‌శంస‌లు కురిపించాడు. ఆస్ట్రేలియాలో పిచ్‌లు స్పిన్‌కు అంత‌గా అనుకూలించ‌కున్నా, త‌ను ఎంత‌గానో రాణించాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

స‌మ‌కాలీన అత్యుత్తమ ఆఫ్ స్పిన్న‌ర్ల‌లో ల‌యోన్ ఒక‌రని భ‌జ్జీ కితాబిచ్చాడు. ఇక అశ్విన్‌, ల‌యోన్ ఇద్ద‌రూ 2011లోనే తమ జాతీయ జ‌ట్ల త‌ర‌పున అరంగేట్రం చేశారు. అశ్విన్ 71 మ్యాచ్‌లాడి 365 వికెట్లు తీశాడు. ల‌యోన్‌ 96 టెస్టులాడిన 390 వికెట్లు తీశాడు. ఇక అశ్విన్ మరికొంతకాలం ఫిట్ గా ఉంటే అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ల జాబితాలో ఉంటాడని భజ్జీ అంచనా వేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -