Thursday, April 25, 2024
- Advertisement -

39 ఏళ్ల అరుదైన రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన బూమ్రా…

- Advertisement -

టీమిండియా పేసర్ బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 39 ఏళ్ల నాటి రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. ఏడాదే అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన ఈ భారత స్పీడ్‌స్టార్‌.. తన పేరిట సరికొత్త రికార్డును లిఖించుకున్నాడు. మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో బుమ్రా 6 వికెట్లను పడగొట్టి ఆతిథ్య జట్టును . 151 పుగుల‌కే కుప్పకూల్చాడు.

మార్కస్‌ హ్యారీస్‌, షాన్‌ మార్ష్‌, ట్రావిస్‌ హెడ్‌, టీమ్‌ పైన్‌, లయన్‌, హజల్‌వుడ్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. తద్వారా టెస్టు ఫార్మాట్‌లో అరంగేట్ర ఏడాదిలో అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఈ ఏడాది జనవరి 5న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఐదు రోజుల ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఇప్పటి వరకు 9 టెస్టులాడి ఏకంగా 42 వికెట్లు పడగొట్టాడు.

1979లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన దిలీప్‌ దోషి ఆ ఏడాది 40 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్‌ను సాధించాడు. మళ్లీ 39 ఏళ్ల తర్వాత బుమ్రా ఈ రికార్డును బ్రేక్‌ చేసి దిలీప్‌ను వెనక్కు నెట్టేసాడు. దిలీప్‌ తర్వాత 37 వికెట్లతో(1996) వెంకటేశ్‌ ప్రసాద్‌, నరేంద్ర హిర్వాణీ 36(1988), శ్రీశాంత్‌ 35(2006)లున్నారు. ఇక ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనతో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన బుమ్రా 9 టెస్ట్‌ల్లో మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -