ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్ పట్టు బిగించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిర్ణీత సమయానికి కన్నా ముందే నిలిపేశారు.దీంతో ఆట ముగిసే సమయానికి ఆసీస్ 236/6 పరుగులు చేసింది. మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఆరు వికెట్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, జడేజా రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీకి వికెట్ దక్కింది.ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 236 పరుగులు చేసింది.
హ్యాండ్‌స్కాంబ్(28 బ్యాటింగ్), ప్యాట్ కమిన్స్( 25 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 187 పరుగులు చేయాలి. ఆదివారం నాల్గో రోజు ఆట ముందుగానే ప్రారంభం కానుంది. భారత్ కాలమాన ప్రకారం ఉదయం గం.04.30 ని.లకు మ్యాచ్‌ను ఆరంభించనున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఇండియా గెలుపును ఎవరు ఆపలేరంటున్నారు అభిమానులు.
- సెన్సేషనల్ ‘చికిరి’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్!
- బాలీవుడ్లో రాజ్ నిడిమోరు భారీ స్కెచ్?
- బాబు రెండేళ్ల పాలన..రూ.3.40 లక్షల కోట్ల అప్పులు!
- బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య
- కోరిక తీరిస్తేనే ఛాన్స్.. యువనటికి వేధింపులు
