Tuesday, March 19, 2024
- Advertisement -

కోహ్లీ, రోహిత్ మద్య పోరు..?

- Advertisement -

ప్రస్తుతం టీమిండియా యూరప్ ట్రిప్ ఉంది. ఇర్లాండ్ తో రెండు టీ20 మ్యాచ్ లు ఆడిన తరువాత, ఇంగ్లండ్ లో ఇంగ్లండ్ జట్టుతో ఒక టెస్ట్ మ్యాచ్ తో పాటు మూడు టీ20 మ్యాచ్ లు కూడా అడనుంది టీమిండియా, ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికా తో జరిగిన అయిదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఇరు జట్లు చెరో రెండు విజయాలతో, చివరి మ్యాచ్ వర్షార్పణం కావడంతో సిరీస్ సమంగా నిలిచింది. ఇక ఐర్లాండ్ జట్టుతో టీమిండియా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. దాంతో రసవత్తరంగా జరిగే ఇంగ్లండ్ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. .

అయితే ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లలో స్టార్ ప్లేయర్స్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం ఉండడంతో అందరి చూపు ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ పై ఉంది. ఇక ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్ జట్టుపై టీమిండియా రికార్డ్ చెప్పుకోదగ్గా స్థాయిలో లేదు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్ జట్టుతో ఆరు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లను ఆడింది టీమిండియా. అందులో నాలుగు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ జట్టు గెలిస్తే కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే టీమిండియా గెలిచింది. అయితే ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్ జట్టుపై ముఖ్యంగా టీ20 మ్యాచ్ లలో అత్యాదిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్ జట్టుపై అయిదు మ్యాచ్ లకు గాను ఒక హాఫ్ సెంచరీ సాయంతో 180 పరుగులు చేశాడు. ఇక 147 పరుగులతో ఆ తరువాతి స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ ఉన్నాడు. అయితే ఇంగ్లాండ్ జరిగే టీ20 సిరీస్ లో రోహిత్.. కోహ్లీ చేసిన పరుగులను ..అధిగమిస్తాడో లేదో చూడాలి. అయితే గత కొన్నేళ్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మద్య ఏ చిన్న రికార్డ్ నైనా ఆసక్తికరమైన పోరుగా చూస్తున్నారు వీరిద్దరి అభిమానులు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కావడంతో వీరిద్దరి అభిమానులు తరచూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఇంగ్లాండ్ తో జరిగే తదుపరి సిరీస్ లో ఆడతారో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టైట్ షెడ్యూల్ కారణంగా ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఎవరో ఒకరు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

పాపం.. అఫ్ఘానిస్తాన్ పై ప్రకృతి కోపం !

పెట్రోల్ బంక్ లో మాజీ క్రికెటర్ చేసిన పనికి షాక్..!

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెంచే అద్బుతమైన టిప్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -