Friday, May 3, 2024
- Advertisement -

కోహ్లీ, ఏబీ డివిలియర్స్ మ‌ధ్య క్రీడా స్పూర్తి అద్భుతం…

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ మధ్యనున్న అనుబంధం ఏంటో అంద‌రికీ తెలిసిందే. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ సహచరులైన వీరిద్దరి మధ్య చక్కటి అవగాహన ఉంది. మంచి మిత్రులుగా కలిసి సాగుతారు. ఒక తల్లికి పుట్టనప్పటికీ.. అన్నదమ్ములుగా మెలుగుతారు. ఒకరు బాగా ఆడితే మరొకరు ప్రశంసిస్తారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో విజయానంతరం ఈ విషయం మరోసారి వెల్లడైంది.

స‌ఫారీ టూర్‌లో టీమిండియా వ‌న్డేసిరీస్‌ను కౌవ‌సం చేసుఉంది. చివ‌రి వ‌న్డేలో అజేయ శతకంతో కోహ్లి (129) జట్టును గెలిపించాక డివిలియర్స్.. విరాట్ దగ్గరకు వచ్చి హత్తుకుని కంగ్రాట్స్ చెప్పాడు. 5-1 తేడాతో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రియ మిత్రుణ్ని అభినందించాడు. ఈ దృశ్యం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. డివిలియర్స్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తాడు కాబట్టే.. అతడు ఆడుతుంటే భారత అభిమానులు కూడా తమ వాడిగానే భావించి ఉత్సాహపరుస్తారు.

గత భారత పర్యటనలో వన్డే సిరీస్‌లో డివిలియర్స్ 3 సెంచరీలు సాధిస్తే.. ప్రస్తుత సఫారీ పర్యటనలో కోహ్లి కూడా మూడు సెంచరీలతో డివిలియర్స్‌ లెక్క సరిచేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -