Friday, April 26, 2024
- Advertisement -

ధావన్ కు నిరాశ.. టీమిండియా విక్టరీ !

- Advertisement -

ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై మంచి ప్రదర్శనతో టి20, వన్డే సిరీస్ లను కైవసం చేసుకున్నా టీమిండియా అదే జోష్ తో వెస్టిండీస్ లో అడుగు పెట్టింది. విండీస్ టిమ్ తో మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్ లు అడనుంది. శికర్ ధావన్ సారథ్యంలో తొలి వన్డే నిన్న ప్రారంభం కాగా.. మొదటి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి సిరీస్ లో బోణి కొట్టింది. ఈ సిరీస్ లో ప్రధాన ఆటగాళ్లు ఎవరు లేనప్పటికి యువ ఆటగాళ్లు అద్బుతంగా రాణించారు. మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 308 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది.

కెప్టెన్ శికర్ ధావన్ చాలా రోజుల తరువాత తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్ లో పెద్దగా పరుగులు చేయని ధావన్.. ఈ మ్యాచ్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో 97 పరుగులు చేసి.. కాస్త దూరం లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక మరో ఓపెనర్ శుబ్ మన్ గిల్ కాస్త దూకుడైన ఆటతీరుతో 64 పరుగులు చేశాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మ్యాచ్ ద్వారా లయ అందుకొని 54 పరుగులు చేశాడు. ఇక 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. 16 పరుగులకే తొలి వికెట్ కోల్పోయినప్పటికి ఓపెనర్ కైల్ మేయర్స్ 75 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

ఇక ఒన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా వచ్చిన బ్రూక్స్ 46 పరుగులు చేశాడు. కైల్ మేయర్స్, బ్రూక్స్ కలిసి రెండవ వికెట్ కు 117 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తరువాత బ్రాండన్కింగ్ 54 పరుగులు, శేపర్డ్ 39 పరుగులు, హోసిన్ 33 పరుగులు చేయడంతో వెస్టిండీస్ గెలిచినంత పనైంది. ఇక మ్యాచ్ ఉత్కంఠగా మారిన టైమ్ లో చివరి ఓవర్ లో 15 పరుగులు కావాల్సి ఉండగా.. విండీస్ టిమ్ 11 పరగులు మాత్రమే చేయడంతో విండీస్ టిమ్ ఓటమి 305 పరుగుల వద్ద నిలిచింది. దాంతో మూడు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -