Friday, April 19, 2024
- Advertisement -

రెండో స్థానంలో రోహిత్.. టీమిండియా గ్రాండ్ విక్టరీ !

- Advertisement -

వెస్టిండీస్, టీమిండియా మద్య జరుగుతున్నా అయిదు మ్యాచ్ ల టి20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన నాల్గవ టి20 మ్యాచ్ లో విండీస్ జట్టుపై భారత్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ 3-1 ఆధిక్యంలో నిలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

టీమిండియా బ్యాట్స్ మెన్స్ లో రిషబ్ పంత్ 31 బంతుల్లో 44 పరుగులు ( 6ఫోర్లు ) చేసి టాప్ స్కోరర్ గా నిలువగా, రోహిత్ శర్మ 16 బంతుల్లో 33 పరుగులు ( 2ఫోర్లు, 3సిక్సులు ), సంజు శాంసన్ 23 బంతుల్లో 30 పరుగులు ( 2ఫోర్లు,ఒక సిక్స్ ), సూర్య కుమార్ యాదవ్ 14 బంతుల్లో 24 పరుగులు ( ఒక ఫోర్, 2సిక్సులు ) తో రాణించారు. ఇక భారీ లక్ష్యంతో భరిలోకి దిగిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 132 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచింది. పురాన్ 8 బంతుల్లో 24 పరుగులు ( ఒక ఫోర్, 3 సిక్సులు ), పోవెల్ 16 బంతుల్లో 24 పరుగులు ( ఒక ఫోర్, 2 సిక్సులు ) చేసి, ఆ మాత్రం స్కోర్ అందించగా మిగిలిన విండీస్ బ్యాట్స్ మెన్స్ అంతా కూడా సమిష్టిగా విఫలం అయ్యారు. ఈ విజయం తో సిరీస్ రోహిత్ సేన సొంతమైంది.

రెండవ స్థానంలో రోహిత్ శర్మ..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సులు బాదిన వీరుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. విండీస్ విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ 553 సిక్సులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 477 సిక్సులతో రెండవ స్థానంలో నిలిచారు. తాజాగా విండీస్ తో జరిగిన నాల్గవ టి20 మ్యాచ్ లో రోహిత్ మూడు సిక్సులు బాదడంతో ఈ స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడవ స్థానంలో పాక్ ఆటగాడు ఆఫ్రిదీ ( 476 ), ఆ తర్వాతి స్థానాల్లో మెక్ కల్లమ్, గప్టిల్ ఉన్నారు. ఇక ఆరవ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని (359) ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -