Saturday, April 20, 2024
- Advertisement -

థ్రిల్లింగ్ విక్టరీ.. క్లీన్ స్వీప్ పై ఇండియా చూపు !

- Advertisement -

టీమిండియా వెస్టిండీస్ మద్య జరుగుతున్నా రెండో వన్డే లో కూడా భారత్ అధిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆక్సర్ పటేల్ మెరుపు విధ్వంసంతో వెస్టిండీస్ ను చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ 2-0 గా ఆధిక్యంలో నిలిచి సిరీస్ కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచారు. ఓపెనర్ షై హోప్ ( 135 బంతుల్లో 115 పరుగులు ) శతకంతో రాణించగా..కెప్టెన్ నికోలస్ పురాన్ 77 బంతుల్లో 74 పరుగులు,కైల్ మేయర్స్ 23 బంతుల్లో 39 పరుగులు, బ్రూక్స్ 36 బంతుల్లో 35 పరుగులు చేసి.. మొత్తంగా 50 ఓవర్లలో 311 పరుగుల భారీ స్కోర్ చేశారు..

ఇక భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన టీమిండియా కు కెప్టెన్ శికర్ ధావన్ 31 బంతులు ఎదుర్కొని కేవలం 13 పరుగులకే వెనుదిరిగాడు. ఇక ఆ తరువాత శుభ్‌మన్‌ గిల్‌ 49 బంతుల్లో 43 పరుగులు( 5 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ 71 బంతుల్లో 63 పరుగులు( 4ఫోర్లు , సిక్స్), సంజూ శాంసన్‌ (51 బంతుల్లో 54 పరుగులు 3ఫోర్లు, 3సిక్సులు), దీపక్‌ హుడా ( 36 బంతుల్లో 33 పరుగులు 2 ఫోర్లు) జట్టును లక్ష్యం వైపుగా నిడిపించారు. కానీ చివర్లో జట్టు విజయనికి పది ఓవర్లలో 100 పరుగులు కావాల్సి వచ్చింది.

ఆ టైంలో ఆక్సర్ పటేట్ విధ్వంసం సృష్టించాడు. 182.86 స్ట్రైక్ రేట్ తో 35 బంతుల్లోనే 64 పరుగులతో (3 ఫోర్లు, 5 సిక్సులు ) వెస్టిండీస్ బౌలర్లపైన విరుచుకుపడడంతో 8 వికెట్ల నష్టానికి 49.4 ఓవర్లోనే 312 పరుగులు చేసి టీమిండియా లక్ష్యాన్ని చేధించింది. దీంతో మ్యాచ్ లో అధ్బుత ఇన్నింగ్స్ ఆడిన ఆక్సర్ పటేల్ కు ” ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ” అవార్డ్ దక్కింది. ఇక రెండు వన్డేలలో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకోగా.. ఈ నెల 27 న జరిగే మూడవ వన్డే లో కూడా విజయం సాధించి వెస్టిండీస్ ను వైట్ వాష్ చేయాలని టీమిండియా చూస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -