Friday, April 26, 2024
- Advertisement -

ఐపిఎల్ విజేత సన్ రైజర్స్ హైదరాబాద్

- Advertisement -

రెండు నెలల సంరంభం ముగిసింది. ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచిన ఐపిఎల్ వేడుక ఉత్కంఠ ఫైనల్ తో ముగిసింది.  2016 ఐపిఎ‌ల‌్ విజేతగా సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ ను సొంతం చేసుకుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తడబడింది. దీంతో కొహ్లి సేనకు భంగపాటు తప్పలేదు.

బెంగళూరులో జరిగిన చిన్నస్వామి స్టేడియంలో  జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 209 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి రాయల్ ఛాలెంజర్స్ ముందుంచుంది. అయితే ఓపెనర్స్ క్రిస్ గేల్, కెప్టెన్ విరాట్ కొహ్లి చెలరేగి ఆడినా మిడిల్ ఆర్డర్ మాత్రం విఫలం కావడంతో బెంగళూరు చేతులెత్తేసింది. ముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్ రైజర్స్ 208 పరుగులు చేసింది. కెప్టెన్ వార్నర్ 69 పరుగులతోనూ, శిఖర్ థావన్ 28 పరుగులతోనూ జట్టుకు గట్టి పునాది వేశారు.

ఇక మిడిల్ ఆర్డర్ లో యువరాజ్ సింగ్ 38 పరుగులతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఇక చివరి ఓవర్లలో కటింగ్ 39 పరుగులతో  చెలరేగి జట్టు విజయానికి తోడ్పడ్డాడు. ఇక బెంగళూరు ఆరంభంలో విజయాన్ని సొంతం చేసుకునేలా కనిపించింది. బ్యాటింగ్ తుపాన్ క్రిస్ గేల్ వరుసగా సిక్స్ లు, ఫోర్లు బాదుతూంటే విజయం బెంగళూరుదే అనిపించింది. కెప్టెన్ విరాట్ కొహ్లి 54 పరుగులతో జట్టుకు మంచి పునాది వేశారు. అయితే గేల్ అవుటైన తర్వాత పరిస్ధితి మారిపోయింది. జట్టును గట్టేక్కిస్తాడనుకున్న డివీలర్స్ వచ్చిన వెంటనే అవుట్ అయ్యాడు. ఆ వెంటనే కొహ్లి కూడా అవుట్ కావడంతో బెంగళూరు పరాజయం ఖరారైపోయింది. చివరి వరకూ పోరాడిన బెంగళూరు రాయల్స్ తొమ్మిది పరుగుల తేడాతో ఐపిఎల్ కప్ ను దూరం చేసుకుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -