- Advertisement -
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2019 వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఆసారి ఐపీఎల్ ఆరంభ వేడుకల కోసం చేస్తున్న ఖర్చును అమరవీరుల కుటుంబాలకి ఇవ్వాలని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. శుక్రవారం బీసీసీఐ, సీఓఏ అధికారులు ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐపీఎల్‌కు చెందిన సీనియర్ అధికారి ఈ ఐడియాను సీఓఏ సభ్యులతో పంచుకున్నారు. ఈ నిర్ణయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అమర వీరుల ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కానీ ఓ సంస్థగా ఆ అమర వీరుల కుటుంబాల బాధ్యతను తీసుకోవాలని భావించాం అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
