Friday, May 3, 2024
- Advertisement -

కేఎల్ రాహుల్‌ పై ప్రశంసలు.. కీపింగ్, బ్యాటింగ్‌తో అదరహో..!

- Advertisement -

ఓపెనర్‌గా వచ్చిన.. మరో స్థానంలో వచ్చిన అతని ఆటలో ఎలాంటి మార్పు లేదు. పరుగుల చేయడం ఆగలేదు. జట్టు విజయం కోసమే అన్నట్లు పరిస్థితులకు తగ్గట్లు ఆడాడు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో మంచి ప్రదర్శన కనబరిచాడు రాహుల్. బ్యాటింగ్, కీపింగ్‌లో రాణించి మహేంద్ర సింగ్‌ను గుర్తు చేశాడు. బ్యాటింగ్‌లో ఐదో స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 రన్స్ చేసి జట్టుకు భారీస్కోర్ అందించాడు. ఆ తర్వాత తన కీపింగ్ తో అదరగొట్టాడు. రిషబ్ పంత్ గాయంతో మ్యాచ్ కు దూరం కావడంతో కీపర్‌గా బాధ్యతలు రాహుల్ తీసుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను రెప్పపాటు సమయంలో స్టంపౌట్ చేసి ధోని మార్క్ కీపింగ్‌ను గుర్తుచేశాడు. జడేజా వేసిన 16వ ఓవర్ చివరి బంతిని తప్పుగా అంచనా వేసిన ఫించ్ పిచ్ దాటాడు.

దీంతో బంతినందుకున్న రాహుల్ అంతే వేగంతో వికెట్లను కొట్టేసి ఫలితాన్ని అందుకున్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్లు రాణిస్తున్న రాహుల్‌పై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించాడు. జట్టు అవసరాల కోసం మల్టిపుల్ రోల్స్ పోషిస్తూ పరిస్థితులను అందిపుచ్చుకుంటున్న కేఎల్ రాహుల్‌ను మెచ్చుకోవాలి. ఒక రోజు ఓపెనర్‌గా, మరొక రోజు నాలుగో స్థానంలో.. ఇంకొక రోజు ఐదో స్థానంలో ఆడి రాణించడం అంత ఈజీ కాదని ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -