Friday, May 3, 2024
- Advertisement -

కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా కొనసాగిస్తే.. ప్రమాదం : కైఫ్

- Advertisement -

కేఎల్ రాహుల్‌ ఈ మధ్య మంచి ఫాంలో ఉన్నాడు. బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు. అలానే వికెట్ కీపర్‌గా కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే రాహుల్‌ని బ్యాకప్ వికెట్ కీపర్‌గా మాత్రమే టీమిండియా మేనేజ్‌మెంట్ వినియోగించుకోవాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించాడు. పంత్ గాయం కారణంగా జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ దూరంకాగా కేఎల్ రాహుల్ ను అప్పటి నుంచి వన్డే, టీ20ల్లో రెగ్యులర్‌ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు.

రిషబ్ పంత్ మళ్లీ ఫిట్‌నెస్ సాధించినా.. టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం అతడ్ని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేస్తూ రాహుల్‌ని కీపర్‌గా కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో చివరి రెండు వన్డేల్లో కీపర్‌గా చేసిన రాహుల్… బ్యాట్స్‌మెన్‌గానూ 99 పరుగులు చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల్లో 224 పరుగులు, మూడు వన్డేల సిరీస్‌లో 204 పరుగులు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టుకి ధోనీ దూరమవగా.. అతని స్థానంలో ఈ ఏడాది జనవరి వరకూ రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు దక్కాయి. కానీ.. అతను ఆశించిన మేర రాణించలేకపోయాడు.

అయితే టీమిండియా మేనేజ్‍మెంట్ కేఎల్ రాహుల్‌‌ని ఫస్ట్ ఛాయిస్‌ కీపర్‌గా చూస్తుండటంపై మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ” రాహుల్ టీమిండియాకు రానున్న రోజుల్లోనూ మెయిన్ కీపర్ గా ఉంటాడని అందరు అనుకుంటున్నారు. కానీ అతడ్ని బ్యాకప్ వికెట్ కీపర్‌గా మాత్రమే వినియోగించుకోవాలని నా సూచన. ఒకవేళ ఎప్పుడైన ఫస్ట్ చాయిస్ కీపర్ గా గాయపడితే అప్పుడు అతడ్ని వినియోగించుకోవచ్చు. అలా కాదని.. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్‌గా అతడ్ని ఇలానే కొనసాగిస్తే..? గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది” అని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -