- Advertisement -

అప్పుడు సఫారీలు…ఇప్పుడు బంగ్లా పులులు

- Advertisement -

ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన నెదర్లాండ్ తాజాగా బంగ్లాను మట్టి కరిపించింది. నెదర్లాండ్స్ బౌలర్ల ముందు 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయారు బంగ్లా ఆటగాళ్లు. 42.2 ఓవర్లలో కేవలం 142 పరుగులకే కుప్పకూలి 87 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు.

బంగ్లా బ్యాటర్లలో హసన్ మిరాజ్‌ ఒక్కడే 35 పరుగులతో రాణించగా మిగితా వారంత దారుణంగా విఫలమయ్యారు. ఓ దశలో 70పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది బంగ్లా. అయితే తర్వాత కుదుట పడుతుంది అనుకున్న డబ్ బౌలర్ల విజృంభణతో కుప్పకూలింది. బాన్ మీక్రేన్ 23 పరుగులుకే 4 వికెట్లు తీశాడు.

ఇక అంతకముందు తొలుత టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌట్‌ అయింది. స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ 68 పరుగులు చేయగా , ఎంగెల్‌బ్రెచ్ట్ 35 పరుగులు చేసి రాణించాడు. చివర్లో వాన్‌ బీక్‌ 23 పరుగులు చేయడంతో అమాత్రం స్కోరైనా సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -