- Advertisement -

న్యూజిలాండ్ గ‌డ్డ‌పై రోహిత్‌ను ఊరిస్తున్న‌ అరుదైన ఘ‌న‌త..

- Advertisement -

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ మ‌రో అరుదైన ఘ‌న‌తను సాధించేందుకు ద‌గ్గ‌ర‌లో ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కీవీస్ గ‌డ్డ‌పై టీ20 మ్యాచ్ గెలిచిన సంద‌ర్భం ఒక్క‌టీ కూడా లేక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. అయితే ఆ ఘ‌న‌త సాధించే అవ‌కాశం ఇప్పుడు రోహిత్‌కు వ‌చ్చింది. వ‌న్డేలో స‌త్తా చాటిన టీమిండియా టీ20 సిరీస్‌పై క‌న్నేసింది.

రెగ్యుల‌ర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి పేరుతో జ‌ట్టుకు దూర‌మ‌వ‌డంతో రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రోహిత్ సార‌థ్యంలోనే టీ-20 సిరీస్‌ను భార‌త్ ఆడ‌నుంది. 2008-09 ప‌ర్య‌ట‌న‌లో ధోనీ సార‌థ్యంలో టీ-20 సిరీస్ ఆడిన టీమిండియా 0-2తో ఓట‌మి పాల‌య్యింది. ఈ నేప‌థ్యంలో ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా న్యూజిలాండ్ గ‌డ్డ‌పై టీ-20 మ్యాచ్ గెలిచిన తొలి భార‌తీయ కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సాధిస్తాడు.

అయితే రోహిత్‌ రెండు రికార్డులలో ఒక్కటైనా సాధించేనా? అంటే అనుమానమే?. ఎందుకంటే కివీస్ జట్టు టీ20లలో అద్భుతంగా రాణించడమే. పైగా ఆడేది వారి సొంత గడ్డపై. కాబట్టి టీంఇండియా సమిష్టి ప్రదర్శన చేసి విజయవంతం అయితేనే రోహిత్ ఖాతాలో ఆ రికార్డులు చేరుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -