Friday, March 29, 2024
- Advertisement -

కెమెరాకు చిక్క‌ని బంతి రైనాకు దొరికింది…

- Advertisement -

ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో సోమవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న‌విజ‌యం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్నిభారత్‌ జట్టు మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తద్వారా లంకేయులతో ఆరంభంలో ఎదురైన ఓటమి ప్రతీకారం తీర్చుకుంది.

మొద‌ట టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు దూకుడుగా ఆడి రెండు ఓవర్లు ముగిసే సమయానికి 25/0తో నిలిచింది. ఈ దశలో మూడో ఓవర్ వేసేందుకు వచ్చిన శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొలి బంతినే.. గుణతిలక (17) మిడ్‌వికెట్ దిశగా బౌండరీకి తరలించేందుకు వేగవంతమైన షాట్ ఆడాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సురేశ్ రైనా పక్కకి దూకుతూ క‌ళ్లు చెదిరే రీతిలో బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు.

గుణతిలక షాట్ కొట్టిన వేగానికి మైదానంలోని కెమెరా‌మెన్ కూడా బంతి రైనా తలమీదుగా వెనక్కి వెళ్లిపోయిందని.. తొలుత భ్రమించి.. తర్వాత మళ్లీ కెమెరాని వెనక్కి తిప్పాడు. కెరీర్ ఆరంభం నుంచి ఫీల్డింగ్‌లో తనదైన మార్క్‌ చూపుతున్న రైనా.. ఈ టోర్నీలోనే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగెత్తుతూ ముందుకు వచ్చి ఓ క్యాచ్‌ని జారవిడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే.. వేగంగా పరుగెత్తుకుంటూ రావడం, మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంటో ఆ క్యాచ్ చేజారింటుంది తప్ప.. రైనా ఫీల్డింగ్‌లో పొరపాటు చేయడం చాలా అరుదని మ్యాచ్ కామెంటేటర్లు సైతం ఆ మ్యాచ్‌లో చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -