Friday, April 26, 2024
- Advertisement -

క్రీడా అభిమానులకి చేదు వార్త.. మయామి ఓపెన్​ నుంచి రోజర్ రివర్స్..!

- Advertisement -

స్టార్ టెన్నిస్​ ఆటగాడు రోజర్​ ఫెదరర్.. ఏటీపీ 1000 మాస్టర్స్​​ మయామి ఓపెన్​ నుంచి తప్పుకున్నాడు. తన ఫిట్​నెస్​ను మెరుగురుచుకునేందుకే ఆట నుంచి తప్పుకుంటున్నట్లు అతడి ఏజెంట్​ టోనీ గోడ్సిక్​ తెలిపాడు.

గత సీజన్​లో తన కుడి మోకాలికి రెండు ఆపరేషన్లు చేయించుకున్న ఫెదరర్.. అప్పటి నుంచి బరిలోకి దిగలేదు. ఖతార్​ దోహా వేదికగా జరిగే హార్డ్​ కోర్ట్​ టోర్నీలో ఈ స్విస్​ స్టార్​ తిరిగి కోర్టులోకి దిగే అవకాశం ఉంది.గత శుక్రవారం అందుకు సంబంధించిన ట్వీట్​ చేశాడు ఫెదరర్. ‘దోహా టోర్నీకి కౌంట్​డౌన్​ ప్రారంభమైంది’ అని పోస్టు చేశాడు.

అత్యధిక వారాలు ఏటీపీ ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న ఆటగాడిగా ఫెదరర్‌ రికార్డును నొవాక్​ జకోవిచ్‌ సమం చేశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ఈ సెర్బియా టెన్నిస్​ స్టార్.. మొత్తం 310 వారాల పాటు నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాడు.

జకోవిచ్​ వచ్చే వారం ఫెదరర్‌ రికార్డు (310)ను బద్దలు కొడతాడు. గత నెలలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన నొవాక్‌.. 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అతడు తొలిసారి 2011లో ప్రపంచ నంబవర్‌వన్‌ ర్యాంకు సాధించాడు.

మారిటైమ్ ఇండియా సమ్మిట్‌.. పెట్టు బడులకి సీఎం జగన్ పిలుపు..!

ఛా.. భారత్ కి పరువు పోయింది.. అది లేక ఇబ్బంది పడ్డ అన్న క్రికెటర్..!

పిచ్చి రాతలు మానండి.. మీడియాపై సురేఖ వాణి కూతురు ఫైర్!

కేటీఆర్ రాజీనామా చేయడానికి సిద్ధమా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -