Monday, May 6, 2024
- Advertisement -

షమీ విజృంభణ…5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా…

- Advertisement -

సెంచూరియన్లో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఎల్గర్, డివిల్లియర్స్ అర్ధ సెంచరీలు చేసి రాణించారు. దూకుడుగా ఆడుతున్న జోడీని అయితే షమీ విడగొట్టాడు. దీంతో భారీస్కోరు దిశ‌గా వెల్తున్న స‌ఫారీ జ‌ట్టుకు బ్రేక్ ప‌డింది.

డివిల్లియర్స్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో పార్థివ్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, అనంత‌రం కొద్ది సేప‌టికే ఎల్గర్ 61 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లోనే లోకేశ్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చుకుని వెనుదిరిగాడు. తరువాత క్రీజులోకి వచ్చిన డికాక్ 12 పరుగలకే షమీ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు.

నిన్న దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ లు మార్కమ్ 1, ఆమ్లా 1 పరుగులు చేసి అవుటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ 6, ఫిలండర్ 0 పరుగులతో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రాకి రెండు వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా స్కోరు164/5 (48 ఓవ‌ర్ల‌కి) గా ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేసి ఆలౌట్ కాగా, భారత్ 307 పరుగులకే ఆలౌటైంది.

సోమవారం మూడో రోజు ఆటలో మర్‌క్రామ్‌(1), హషీమ్‌ ఆమ్లా(1)ల వికెట్లను మూడు పరుగులకే కోల్పోయిన సఫారీలు.. మంగళవారం నాల్గో రోజు ఆటలో ఏబీ, డీన్‌ ఎల్గర్‌ వికెట్లను ఏడు పరుగుల వ్యవధిలో కోల్పోయారు. క్రీజ్‌లో కుదరుకున్న ఈ జోడిని భారత పేసర్‌ మొహ్మద్‌ షమీ అవుట్‌ చేసి టీమిండియాకు మంచి ఆరంభాన్నిచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -