Friday, May 3, 2024
- Advertisement -

ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి..ఫైనల్‌కు శ్రీలంక

- Advertisement -

ఆసియా కప్‌ 2023లో భాగంగా పాకిస్థాన్ – శ్రీలంక మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందింది. ఫైనల్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కాగా చివరి బంతి వరకు సాగిన పోరులో లంక గెలుపొందింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక సరిగ్గా 42 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చివరి ఓవర్‌లో 8 పరుగులు కావాల్సి ఉండగా తొలి నాలుగు బంతుల్లో 1,1,0,w వచ్చాయి. దీంతో చివరి రెండు బంతుల్లో కావల్సింది 6 పరుగులు. శ్రీలంక ఓటమి ఖాయం అనుకున్నారు అంతా. కానీ క్రీజులో ఉన్న అసలంక 5వ బంతిని ఫోర్‌గా, లాస్ట్ బాల్ రెండు పరుగులు చేయడంతో పాక్ ఓటమి తప్పలేదు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లలో కుషాల్‌ మెండిస్‌ (91), సమరవిక్రమ (48), అసలంక (49 నాటౌట్‌) రాణించారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 252 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ అంతా విఫలమయ్యారు. ఓ దశలో శ్రీలంక 200 పరుగులు దాటుతుందా అనే సందేహం నెలకొంది. కానీ ఈ దశలో క్రీజులో వచ్చిన వికెట్ కీపర్ రిజ్వాన్ మరో బ్యాట్స్‌మెన్ ఇఫ్తిఖార్‌ అహ్మద్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రిజ్వాన్‌ (86 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా అబ్దుల్లా షఫీఖ్‌ (52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడనుంది శ్రీలంక. దీంతో ఫైనల్లో భారత్ పాక్ మ్యాచ్ ఉంటుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -