Monday, May 6, 2024
- Advertisement -

సిరాజ్ మ్యాజిక్..8వ సారి విజేతగా భారత్‌

- Advertisement -

ఆసియా కప్‌ విజేతగా 8వ సారి నిలిచింది భారత్. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ఆ జట్టును చిత్తు చేసింది భారత్. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ జట్టు కెప్టెన్‌కు ఇది తప్పు నిర్ణయం అని తెలవడానికి ఎంతో సమయం పట్టలేదు. హైదరాబాదీ బౌలర్ సిరాజ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది.

52 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 6.1 ఓవర్లలో 51 పరుగులు చేసి ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని చేధించింది. ఇసాన్ కిషన్ 23 పరుగులు చేయగా గిల్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదుచేసింది భారత్.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్ 6 వికెట్లు తీయగా ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా బుమ్రా 1 వికెట్ తీశారు. ఇక ఇప్పటివరకు ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక ఓడిపోయింది లేదు. దీంతో ఆ రికార్డును చేరిపేసింది భారత్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -