Monday, April 29, 2024
- Advertisement -

భారత్‌కు షాకిచ్చిన బంగ్లా…

- Advertisement -

ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్ -4 నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో భారత్‌కు షాకిచ్చింది బంగ్లాదేశ్. రోహిత్ సేనను 6 పరుగుల తేడాతో ఓడించింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్‌లో శుభ్‌మన్‌ గిల్, అక్షర్ పటేల్ తప్ప మిగితా ఆటగాళ్లంతా విపలమయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఒంటరిపోరు చేశారు గిల్. 5 సిక్సర్లు, 18 ఫోర్లతో 121 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 42 పరుగులతో రాణించిన ఫలితం లేకపోయింది. కెప్టెన్‌ రోహిత్‌ (0), తెలంగాణ కుర్రాడు తిలక్‌ వర్మ (5), కేఎల్‌ రాహుల్‌ (19), ఇషాన్‌ కిషన్‌ (5), రవీంద్ర జడేజా (7) విఫలమయ్యారు.

అంతకముందు టాస్ గెలిచిన భారత్..బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక రోహిత్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో 59 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కొల్పోయింది బంగ్లా. షకీబ్‌ అల్‌ హసన్‌ (80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తౌహిద్‌ (54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), నసుమ్‌ అహ్మద్‌ (44; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించారు. దీంతో 50 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 265 పరుగులు చేసింది. షకీబ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వార్డు దక్కింది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో శ్రీలంకతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -