Tuesday, April 23, 2024
- Advertisement -

సురేశ్ రైనా : “చిన్న తలా ” రిటైర్మెంట్.. ఆ మెరుపు వేగం జ్ఞాపకాలే !

- Advertisement -

ఇండియన్ క్రికెట్ టీంలో కొంత మంది ఆటగాళ్లు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తుంటారు.. అలాంటి ఆటగాళ్లలో సురేశ్ రైనా ఒకడు.. మిడిలార్డర్ లో బెస్ట్ ఫినిషర్ గా, అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ బౌలర్ గా, ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టె చురుకైన ఫీల్డర్ గా రైనా చూపించిన ప్రతిభ ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. మరి అలాంటి చిచ్చర పిడుగు రైనా.. క్రికెట్ కు సంభంధించిన అన్నీ ఫార్మెట్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్లో ప్రకటిస్తూ.. ” కెరియర్ లో తనకు సహకరించిన బి‌సి‌సి‌ఐ, యూపీ క్రికెట్ అసోసియేషన్, సి‌ఎస్‌కే లకు దాన్యవాదాలు తెలుపుతూ.. తనకు ఎప్పుడు అండగా నిలుస్తూ వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు ” అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. ఇక ఇప్పటివరకు రైనా 226 వన్డేల్లో 5,615 పరుగులు చేశాడు. ఇక 18 టెస్టు మ్యాచ్ ల్లో 768 పరుగులు, 78 టి20 మ్యాచ్ లలో 1,605 పరుగులు సాధించాడు. ఇక చాలా వరకు రైనా కెరియర్ ధోని కెప్టెన్సీ లోనే సాగింది. ధోని 2004 లో భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా, రైనా 2005 లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ఇద్దరి భగస్వామ్యం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మిడిలార్డర్ లో ఈ ఇద్దరి జోడీ ప్రత్యర్థి జట్లకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. అందుకే అభిమానులు ధోని ని ” తలా ” గా పిలిస్తే.. రైనా ను ” చిన్న తలా ” గా పిలుస్తూ ఉంటారు.

ఇక అంతర్జాతీయ క్రికెట్ కు కూడా ఈ ఇద్దరు ఒకేసారి వీడ్కోలు చెప్పడం గమనార్హం. ఐ‌పి‌ఎల్ ప్రారంభం నుంచి ధోని కెప్టెన్సీ లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన రైనా.. సి‌ఎస్‌కే విజయం సాధించిన చాలా మ్యాచ్ లలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత ఫామ్ లేమి కారణంగా సి‌ఎస్‌కే సస్పెండ్ చేయడంతో 20146,17 సంవత్సరాలలో గుజరాత్ తరుపున ఆడాడు. అయితే తన ఐపీఎల్ కెరియర్ మొత్తంలో 205 మ్యాచ్ లు ఆడిన రైనా.. టోర్నీలోనే అత్యుత్తమ ప్లేయర్స్ లో ఒకడిగా కొనసాగుతూ ” మిస్టర్ ఐపీఎల్ ” గా పేరు సంపాధించుకున్నాడు. ఇక మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఐపీఎల్ చరిత్రలోనే మొట్ట మొదటి సెంచరీ సాధించిన ఇండియన్ క్రికెటర్ కూడా సురేశ్ రైనానే కావడం విశేషం. ఇక రైనా క్రికెట్ కు సంబంధించిన అన్నీ ఫర్మాట్లకు గుడ్ బై చెప్పడంతో.. అతడి బ్యాటింగ్ లోని మెరుపులు, ఫీల్డింగ్ లోని మెరుపు వేగం అన్నీ జ్ఞాపకాలే అంటూ చిన్న తలా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Alao Read: ఆసియా కప్ : గెలిస్తే ముందుకి.. ఒడితే ఇంటికి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -