మా ప్రైవసీని గౌరవించండి

- Advertisement -

సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా విరాట్ కోహ్లి, అనుష్క(విరుష్క) ల కూతురు (వామిక) తొలిసారి కెమెరా కంటికి చిక్కింది. దీంతో పంబరపడిపోయారు వీరి అభిమానులు. తర్వాత ఆ ఫొటోలను పోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. తమ కూతురు ఫొటోలు వైరల్ కావడంపై విరుష్క జంట స్పందించింది. దయ చేసి వామిక పొటోలు వైరల్ చేయొద్దని అభిమానులకు కోరారు.

తమ కూతురు ప్రైవసీ విషయంలో గతంలో వెల్లడించిన అభిప్రాయాలకే తాము కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ఈ విషయంలో తమ ఓపీనియన్ లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎవరైతే ఫొటోలు వైరల్ చేయలేదో వారిని మేము అభినందిస్తున్నాము అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో అర్ధ సెంచర చేసిన కోహ్లి అనుష్క శర్మ వైపు బ్యాటును చూపిస్తూ చేతులూపాడు. ఈ సమయంలో అనుష్క చేతిలో ఉన్న వామిక సైతం కోహ్లిని చూస్తూ కేరింతలు కొట్టింది . ఈఫోటోలు లైవ్ లో టెలీకాస్ట్ అయ్యాయి.

Also Read: టీం ఇండియాకు భారీ ఫైన్

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -