Friday, April 19, 2024
- Advertisement -

King Is Back: కోహ్లీ జోరు.. టార్గెట్ వరల్డ్ కప్ !

- Advertisement -

ఆసియా కప్ 2022 లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఎవరు ఊహించని విధంగా సూపర్ 4 లో రెండు మ్యాచ్ లు ఓడిపోయి ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎంతో నిరుత్సాహనికి గురైయ్యారు. లీగ్ మ్యాచ్ లలో అద్భుతంగా రాణించి, సూపర్ 4 లో మాత్రం తేలిపోయింది టీమిండియా. అయితే కప్ చేజారినప్పటికి ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం హ్యాపీగానే ఉన్నారని చెప్పవచ్చు.

ఎందుకంటే మూడేళ్ళ నుంచి ఫామ్ లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ ఆసియా కప్ ద్వారా తిరిగి అద్బుతంగా ఫామ్ లోకి వచ్చాడు. ఆసియా కప్ లో ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ కోహ్లీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అభిమానాలకు మళ్ళీ పాత కోహ్లీ ని పరిచయం చేశాడు. ముఖ్యంగా సూపర్ 4 లో రెండు మ్యాచ్ లు ఓటమిపాలు అయ్యి కప్ రేస్ నుంచి టీమిండియా నిష్క్రమించడంతో.. నిరాశగా ఉన్న అభిమానులను నామమాత్రంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ చేసిన వీర విహారం అభిమానులకు ఫుల్ కిక్కును ఇచ్చింది. ఆకాశమే హద్దుగా కోహ్లీ బౌండరీలు బాదుతుంటే ” కింగ్ ఇస్ బ్యాక్ ” అంటూ అభిమానులు కేరింతలతో రెచ్చిపోయారు.

టి20 హిస్టరీలో అత్యాదిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. ఆఫ్ఘన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో కప్ చేజారినప్పటికి తమ అభిమాన ఆటగాడు తిరిగి ఫామ్ అందుకోవడంతో అభిమానులు ఖుషీగానే ఉన్నారు. ఇక అక్టోబర్ లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం జట్టుకు అతిపెద్ద బలం అనే చెప్పవచ్చు. మరి ప్రస్తుతం ఫామ్ అందుకున్న కింగ్ కోహ్లీ ఆదే ఫామ్ ను టి20 వరల్డ్ కప్ లో కూడా కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -