Thursday, May 9, 2024
- Advertisement -

వైసీపీలోకి రావాల‌ని జ‌గ‌న్ ఫోన్ చేశారు .. గంగుల‌ ప్ర‌తాప్ రెడ్డి

- Advertisement -
YSRCP President YS Jagan called me : Gangula Pratap Reddy

వైసీపీ నుంచి నంద్యాల ఉప ఎన్నిక అభ్య‌ర్తిపై పూర్తి క్లారిటీ వ‌చ్చింది.గ‌త కొద్దిరోజులుగా వైసీపీలో చేరుతున్నార‌న్న వార్త‌ల‌కు కాంగ్రెస్ మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్‌రెడ్డి స్పందించారు.జగన్ ఆహ్వానిస్తే వైసీపీలో చేరేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు.

అయితే గంగుల ప్రతాప్‌ రెడ్డి మాటలకు వైసీపీ నాయకత్వం ఎలా స్పందించిందన్న దానిపై ఇంతకాలం క్లారిటీ లేదు.
అయితే ఇప్పుడు ఈ విషయంలో ప్రతాప్‌ రెడ్డే స్పష్టత ఇచ్చారు. ఒక వెబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన… జగన్‌ తనకు ఫోన్ చేశారని చెప్పారు. వైఎస్ సమకాలీకుడైన తనను పార్టీలోకి రావాల్సిందిగా జగన్ ఆహ్వానించారని చెప్పారు. వైసీపీతో కలిసి నంద్యాలలో మార్గదర్శకత్వం వహించాల్సిందిగా కోరారన్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

జగన్‌తో కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. జగన్ వయసులో చిన్నవాడే అయినా అతడి ఆలోచన సరళి మాత్రం చాలా బాగుందన్నారు.జ‌గ‌న్‌తో క‌ల‌సి ప‌నిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ప్రజాసమస్యలపై జగన్‌ స్పందిస్తున్న తీరు చూస్తుంటె ఆయన తండ్రిలాగే ఉందన్నారు. జగన్‌ను తానుచిన్నప్పటి నుంచి చూస్తున్నానన్నారు. తమ దగ్గర నోట్ల మూటలు లేకపోయినా… వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని చెప్పారు. మంచికి, మర్యాదకే ప్రజలు ఓటేస్తారన్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలన్న ఉద్దేశంతో సెప్టెంబర్ నుంచి చురుగ్గా నియోజకవర్గాల్లో పర్యటించాలని భావించాన‌న్నారు. కానీ ఇప్పుడు జగన్ ఫోన్ చేసి నంద్యాల ఉప ఎన్నికల్లో నిలబడాల్సిందిగా కోరడంతో తన కార్యక్రమాలను ఇప్పటి నుంచే మొదలుపెట్టానని ప్రతాప్ రెడ్డి చెప్పారు. ప్రతాప్ రెడ్డి చెప్పిన దాని బట్టి నంద్యాల ఉప ఎన్నికల వైసీపీ అభ్యర్థి ఆయనేనని స్పష్టమవుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఆయన పేరును వైసీపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించనుంది.నంద్యాల ఉప ఎన్నిక బ‌రిలో వైసీపీ నుంచి క్లారిటీ ఉంది..మ‌రి టీడీపీ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}FgEqC49QnZY{/youtube}

Related

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -