Friday, May 3, 2024
- Advertisement -

వ‌చ్చే మూడు సంత్స‌రాల‌ల్లో ఐటీ రంగంలో 6 ల‌క్ష‌ల ఉద్యోగాలు పోనున్నాయి.

- Advertisement -
Performance not the real reason for the mass lay offs, say sacked IT employees

దేశీయంగా ఐటీ సంస్థ‌లు తీవ్ర గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి.ఎప్పుడు ఎవ‌రి ఉద్యోగాలు ఊడిపోతాయోన‌నే భ‌యం ఉద్యోగులను వెంటాడుతోంది. ఇక కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు ప్రమాదకర స్థాయిల్లోకి వెళ్తోంది. వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాల‌ల్లో 6ల‌క్ష‌ల ఉద్యోగాలు ఊడ‌నున్నాయి.

హెడ్ హంటర్స్ ఇండియా అనే పరిశోధన సంస్థ అంచనాల ప్రకారం ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వరకు వచ్చే మూడేళ్లపాటు ఉంటుందని తెలిసింది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అందుకునేందుకు సన్నద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఈ సంస్థ అంటోంది. ఈ ఏడాది ఇప్పటికే రూ.56,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు హెడ్‌ హంటర్స్‌ ఇండియా వ్యవస్థాపక చైర్మన్, ఎండీ కె.లక్ష్మీకాంత్‌ పేర్కొన్నారు. మూడేళ్ల కాలంలో ఆరు లక్షల మంది ఐటీ ఇంజనీర్లు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిన ప్రమాదకర పరిస్థితుల్లో ఉండ‌బోతున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఐటీ రంగం ఇప్పుడు అనిశ్చితిలో ఉంది. క్లౌడ్‌ ఆధారిత డిజిటల్‌ టెక్నాలజీలు శరవేగంగా దూసుకొస్తున్నాయి. కంపెనీలు కూడా వీటిపై దృష్టి సారించి, సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నాయి.ఈ పరిణామ క్రమంలో 35 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న నిపుణులే ఇబ్బంది పడతారని లక్ష్మీకాంత్‌ వివరించారు. ఇదంతా వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడం వల్లే జరగడం లేదన్నారు.వచ్చే మూడు నాలుగేళ్లలో ఐటీ సర్వీసుల రంగంలో సగం మంది ఉద్యోగులు పనికిరారంటూ మెకిన్సే తాజా నివేదిక గురించి ఆయ‌న ప్రస్తావించారు

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -