సమీరా రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్న మీ టూ హీరోయిన్

258
Actor Sruthi Hariharan Announces Pregnancy
Actor Sruthi Hariharan Announces Pregnancy

ప్రముఖ కన్నడ నటి శృతి హరిహారన్ గురించి తెలియని వారు ఉండరు. మీ టూ మూవ్మెంట్ జోరుగా జరుగుతున్న సమయంలో ఈమె కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి ముందుకు వచ్చి ఆమెకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాతో పంచుకుంది. ముఖ్యంగా ఆమె నిబునన్ సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ కింగ్ అర్జున్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్ కామెంట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె కి ఆఫర్లు కూడా బాగా తగ్గిపోయాయని వార్తలు వినిపించాయి. “అంతకుముందు వారానికి మూడు సినిమా ఆఫర్లు వస్తే ఇప్పుడు ఒకటి కూడా రావడం లేదని” ఆమె స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఇప్పుడు శ్రుతి హరిహరన్ తన పర్సనల్ విషయం వల్ల ఆ వార్తల్లోకి ఎక్కింది. శ్రుతి హరిహరన్ డాన్స్ కొరియోగ్రాఫర్ రామ్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె గర్భవతి. త్వరలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది శ్రుతి హరిహరన్. తాజాగా ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తన బేబీ బంప్ ని చూపిస్తూ శ్రుతి హరిహరన్ పోస్ట్ చేసిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేస్తున్నారు. మొన్నటిదాకా సినిమాలకు దూరమైన సమీరా రెడ్డి కూడా బేబీ బంప్ తో ఫోటోలు షేర్ చేసింది. తాజాగా ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. చూస్తుంటే ఇప్పుడు శ్రుతి హరిహరన్ కూడా సమీరారెడ్డి బాటలో నడుస్తున్నట్లు ఉంది.

Loading...