లేటు వయస్సులో గుడ్ న్యూస్ చెప్పిన నమిత

- Advertisement -

లేటు వయసులో నటి నమితి తల్లి కాబోతోంది. తన చిన్ననాటి స్నేహితుడిని 2017లో పెళ్లి చేసుకుని సినిమాకు పూర్తిగా దూరమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కొన్ని టీవీ షోస్‌లో దర్శనమిచ్చింది. నమిత పొలిటికల్ ఎంట్రీపైనా వార్తలొచ్చాయి. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. తాజాగా అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్ చెప్పింది. తాను తల్లిని కాబోతున్నానంటూ తన పుట్టిన రోజు ( మే 10) సందర్భంగా వెల్లడించింది.

బేబీ బంప్‌తో ఉన్న ఫోటో ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని రాసుకొచ్చింది 41 ఏళ్ల నమిత. ఎన్నో మార్పులు వచ్చాయనీ.. ముఖంలో చిరునవ్వు వచ్చందని మురిసిపోతోంది. కొత్త జీవితం, కొత్త పిలుపులు నా దరికి చేరబోతున్నాయి. ఈ మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. ఎప్పటి నుండో ఈ అనుభవం కోసం ప్రార్థనలు చేస్తున్నా.

- Advertisement -

కడుపులో చిన్నారి కదులుతుంటే.. ఇంతకు ముందెన్నడూ లేని గొప్ప అనుభూతి కలుగుతోంది..’’ అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం నమిత షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -