అమ్మకాబోతున్నమరో ముద్దుగుమ్మ

- Advertisement -

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్, టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్, ప్రస్తుతం గర్భవతులు అన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ముద్దుగుమ్మలు మాతృత్వ మధురిమల్ని చవిచూడబోతున్నారు. తమ లైఫ్‌లోకి అడుగుపెట్టబోతున్న మూడో వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ జాబితాలోకి మరో అమ్మడు కూడా చేరుబోతోంది.

ఆమె ఎవరో కాదు.. బాపుగారి బొమ్మ ప్రణీత సుభాష్..‘రభస, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద,బ్రహ్మోత్సవం, హలో గురూ ప్రేమకోసమే’లాంటి మూవీలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈ కన్నడ కస్తూరి..బెంగళూర్‌కి చెందిన బిజినెస్‌ మెన్ నితిన్ రాజును గతేడాది పెళ్ళి చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు గుడ్‌ బై చెప్పి..తన భర్తతో వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

- Advertisement -

తాజాగా సోషల్ మీడియాలో తాను ప్రగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించి అభిమానుల్ని ఖుషీ చేసింది. భర్తతో దిగిన కొన్ని ఫోటోస్ ను షేర్ చేసిన ప్రణీత..‘తన భర్త 34వ పుట్టిన రోజు నాడు.. దేవతలు తమకు అద్భుతమైన బహుమతి ఇచ్చారంటూ ఆనందం వ్యక్తం చేసింది. భర్తతో సన్నిహితంగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో ఒక చేతిలో ఆమె ఫీటస్ స్కానింగ్ రిపోర్ట్ పట్టుకుని కనిపించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఫోటోస్ కూడా నెటిజెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ప్రణీత, ఆమె భర్తను అభినందిస్తూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్నా…

పవన్ కల్యాణ్ తనయుడి టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ?

మరో రికార్డు సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -