Friday, April 26, 2024
- Advertisement -

ప్రగతి ఆంటీ హాట్ డాన్స్ చూస్తే షాకే..!

- Advertisement -

టాలీవుడ్ లో తల్లి, అత్త పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది నటి ప్రగతి. దాదాపు అన్ని సినిమాల్లో ఈమె కనిపిస్తూనే ఉంటుంది. సెంటిమెంట్, సహజత్వం మాత్రమే కాకుండా కామెడీ కూడా చేయగలదు. ‘బాద్ షా’ సినిమాలో ఈమె చేసిన కామెడీ బాగా వర్కవుట్ అయింది. ఆ తర్వాత ‘ఎఫ్2’ చిత్రంలో కూడా ఈమె కామెడీ బాగా పండింది.

గడసరి అత్త పాత్రలో … హీరో వెంకటేష్ తో సమానంగా కామెడీని చేసి అందర్ని నవ్వించింది. ఈమెలో ఇంత కామెడీ యాంగిల్ కూడా ఉందా అనేంతలా ఈమె నటించింది. ఇంతేనా అనుకుంటే మొన్నటికి మొన్న ‘రాయల్ ఎన్ ఫీల్డ్ బండి నడుపుతూ’ ఉన్న వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక లాక్ డౌన్ టైములో తన బాడీని షేప్ చేసుకోవడానికి రక రకాల ఆసనాలు వేస్తూ … హాట్ హాట్ గా ఉన్న తన ఫోటోలను పోస్ట్ చేసింది.

అంతే కాదు.. తన టాటూ వేయించుకున్న ఫోటోలను సైతం షేర్ చేసింది. ఈమె గ్లామర్ రోల్స్ కు కూడా రెడీ అవుతుందా అన్న అనుమానాలు కలిగేలా ఉన్నాయి ఆ ఫోటోలు. ఇక ఇప్పుడు ఓ తీన్మార్ సాంగ్ కి లుంగీ కట్టుకుని మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఈ వీడీయో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో ఐటెం సాంగ్స్ కూడా తను చేయడానికి రెడీ అని పరోక్షంగా హింట్లు ఇస్తుందా అనే కామెంట్స్ కొందరు పెడుతున్నారు. మరికొంతమంది “ప్రగతి ఆంటీ ఎనర్జీ సూపర్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

https://youtu.be/fxRza1sczew

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -