Saturday, April 27, 2024
- Advertisement -

అప్పుడే పెళ్లి చేసుకుంటానంటున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ హీరోయిన్‌

- Advertisement -

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో న‌టించిన‌ ప్ర‌ణీత ఆ త‌ర్వాత మంచి సినిమాలు రాలేదు. ఆ సినిమాలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మంచి జోడిగా క‌నిపించినా ఆ త‌ర్వాత సినిమాలో స‌మంత వ‌చ్చేసింది. ఇక అప్ప‌టినుంచి ప్ర‌ణీత‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. అత్తెస‌రు సినిమాల‌తో కాలం గడుపుతున్నప్ర‌ణీత చాలా రోజుల త‌ర్వాత ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చింది.

విశాఖ‌ప‌ట్ట‌ణంలో నిన్న శుక్ర‌వారం ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ణీత ఈ సంద‌ర్భంగా అభిమానుల‌తో మాట్లాడింది. ఆ త‌ర్వాత ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సంద‌డి చేసింది. అనంత‌రం మీడియాతో మాట్లాడింది. రెండేళ్ల తరువాత పెళ్లి కబురు చెబుతానని ప్రణీత చెప్పింది. ఇప్పుడిప్పుడే మంచి సినిమాల్లో నటించే అవకాశం వస్తోందని, అత్తారింటికి దారేదితో టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడిందని ఆనందంతో చెప్పింది. తనకు ఇష్టమైన నటుడు పవన్‌కల్యాణ్‌ అని ప్ర‌క‌టించింది. ఇప్పుడు త‌న‌ దృష్టంతా సినిమా కెరీర్‌పైనే ఉందని, రెండేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటానని బ‌దులు ఇచ్చింది. మంచి సినిమాలు వ‌స్తే ఏ భాషయినా స‌రే న‌టించ‌డానికి ఆస‌క్తి క‌న‌రుబ‌స్తాన‌ని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -