Friday, April 26, 2024
- Advertisement -

కొడుకు వయసు ఉన్న హీరోతో టబు రొమాన్స్..!

- Advertisement -

టాలీవుడ్, కోలీవుడ్ లో గ్లామర్స్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది టబు. ఎన్నో సినిమాల్లో గుర్తిండిపోయే పాత్రలు చేసింది. ఇప్పటికి నటిస్తోంది. కాకపోతే ఆమె వయసు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఫస్ట్ టైం టబు ఓ వేశ్య పాత్రలో కనిపించబోతుంది. అంతేకాదు 24 ఏళ్ల బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖత్తర్‌తో కలిసి రొమాన్స్ చేయనుంది.

వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రం ’ఎ సూటబుల్ బాయ్’. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడైన ఇషాన్ తనకు తల్లి వయసున్న నటితో కలిసి రొమాన్స్ చేయబోతుండటం బాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను తాజా రిలీజ్ చేశారు. లుక్ లో టబు ఉయ్యాలపై వయ్యారంగ కూర్చుని ఉంటే పక్కనే ఇషాన్ బోర్లపడుకుని ఆమెని తనివితీరా చూస్తున్నారు. ఈ లుక్ కు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. విక్రమ్ సేథ్ రాసిన ‘ఎ సూటబుల్ బాయ్’ నవల ఆధారంగా ఈ సినిమాని మీరా నాయర్ తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ మూవీ సోరీ ఏంటంటే.. మాన్ కపూర్ (ఇషాన్ ఖత్తర్) మహేష్ కపూర్ (రామ్ కపూర్) అనే పేరున్న రాజకీయనాయకుడి కుమారుడు. ఎవరికీ బెదరడు. అడ్డొచ్చినవాళ్లని కొట్టిపడేస్తుంటాడు. అలాంటిది సయ్యదా బాయ్ (టబు) అనే వేశ్యను చూసి ప్రేమలో పడతాడు. ఆమె వేశ్య అయినప్పటికీ ఆమె అందానికి ముగ్దుడైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? అన్నదే కథ. 24 ఏళ్ల యువకుడు 48 ఏళ్ల మహిళతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా చూపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -