Tuesday, April 23, 2024
- Advertisement -

టాలీవుడ్ లో వేశ్య పాత్రలో నటించిన ఐదుగురు​ నటీమణులు

- Advertisement -

తమ నటనను సవాల్ చేసే పాత్ర కావాలంటారు నటీమణులు. వారికి దొరికే పాత్రల్లో అలాంటి పాత్ర ‘వేశ్య’. అలాంటి పాత్ర చేయడం వారికి కత్తి మీద సాము లాంటిదే! అశ్లీలంగా అనిపించకూడదు, అలా అని పాత్ర ప్రవర్తన నీరుగారిపోకూడదు. తెలుగులో వేశ్య పాత్రలో నటించిన ఐదుగురు​ నటీమణుల గురించి..

సావిత్రి – కన్యాశుల్కం (1955)
గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నాటకంలో మరపురాని పాత్ర ‘మధురవాణి’. రంగస్థలం మీద ఎందరో ఆ పాత్రకు ప్రాణం పోయగా, తెరపై ఆ‌ పాత్రను అద్భుతంగా పోషించారు మహానటి సావిత్రి. ఇదే చిత్రంలో ఎన్టీఆర్ గిరీశం పాత్ర పోషించడం విశేషం.

లక్ష్మి – మల్లెపువ్వు(1978)
హిందీలో విజయవంతమైన ‘ప్యాసా’ను తెలుగులో ‘మల్లెపువ్వు’గా తీశారు. హిందీ వహీదా రెహ్మాన్ పోషించిన వేశ్య పాత్రను, తెలుగులో​ లక్ష్మి చక్కగా పోషించారు. తన కెరీర్లో మర్చిపోలేని పాత్రగా ఈ చిత్రం నిలిచిపోయింది. ‘చిన్నమాట.. ఒక చిన్న మాట’ పాట సూపర్ హిట్.

జయసుధ – ప్రేమాభిషేకం(1981)
‘దాసరి నారాయణరావు గారి సినిమాలో వేశ్య పాత్ర ఇచ్చినా వేయడానికి నేను సిద్ధమే’ అని ఒక సందర్భంలో విలేకరులతో అన్నారట జయసుధ. ఆ తర్వాత నిజంగా ‘ప్రేమాభిషేకం’ సినిమాలో వేశ్య పాత్రను అద్భుతంగా పోషించారు. ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు.

టబూ – పాండురంగడు(2008)
బాలకృష్ణ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పాండురంగడు’ చిత్రంలో టబూ వేశ్య పాత్రను పోషించారు. అంతకుముందు 2002లో హిందీ చిత్రం ‘చాందినీబార్’లో వేశ్యగా నటించి జాతీయ పురస్కారం అందుకున్నారు.

అనుష్క – వేదం(2010)
సరోజ పాత్రలో నటించి అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులనూ మెప్పించారు నటి అనుష్క. ఈ చిత్రానికి గానూ ఫిల్మ్‌ఫేర్, నంది జ్యూరీ ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. ఆమె మీద చిత్రించిన ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ పాట చాలా పాపులర్.

టాలీవుడ్ హాస్య నటులు అందుకున్న నందులు

తెలుగు లో ఉత్తమ నటీమణులు ఆనలుగురు…

హీరోయిన్లకు సాటి హీరోయిన్లు గాత్ర దానం చేసిన వారు వీళ్లే..!

ఎప్పటికీ గుర్తుండిపోయే జయమాలిని ఐటమ్ సాంగ్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -