Saturday, April 27, 2024
- Advertisement -

అదితి రావు ఆడిష‌న్‌… వామ్మో అదితి ని అలా చేయమన్నారట

- Advertisement -

అదితి రావు హైదరి భారత చలన చిత్ర పరిశ్రమ లో ప్రసిద్ది కాంచిన నటి. తెలుగు లో సమ్మోహనం అనే సినిమా తో అరంగేట్రం చేసి ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలు పొందిన అదితి రావు మెల్ల మెల్లగా తెలుగు లో తన స్థానాన్ని సుస్థిర పరుచుకుంటుంది. చాలా రోజుల క్రితమే హిందీ లో అరంగేట్రం చేసినప్పటికీ ఈ మధ్యనే అదితి రావు పాపులర్ అవ్వడం మొదలు పెట్టింది. ఇటీవలే మీడియా తో మాట్లాడుతూ తన సినిమా కెరీర్ కి సంబంధించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలిపింది.

ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తనకు జరిగిన ఒక ఆడిషన్ కి సంబంధించిన అనుభవాన్ని మీడియా తో పంచుకుంది. తనకి పెద్దగా అసంతృప్తి పరిచిన సంఘటనలు ఏమీ జరగలేదు కానీ ఏ సాలి జిందగీ అనే సినిమా ఆడిషన్ మాత్రం మర్చిపోలేను అని చెప్పింది.

“లిటరల్ గా నేను ఆ ఆడిషన్ సమయం లో ఒక అపరిచిత వ్యక్తితో మెక్ ఔట్ చేయాల్సిన పరిస్తితి వచ్చింది.” అటువంటి పరిస్థితిలో నుండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను దాటుకుంటూ అదితి రావు ఈ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం అదితి రావు హైదరి, నాని, సుధీర్ బాబు కలిసి చేస్తున్న సినిమా లో హీరోయిన్ పాత్ర పోషిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -